Site icon NTV Telugu

Shahrukh Khan : అలాంటి ఒత్తిడి మాత్రం ఉండకూడదు..

Sharukhan

Sharukhan

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో టీవీ సీరియల్స్​లో నటించిన షారుక్, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, కెరీర్​లో వెనుదిరిగి చూసుకోకుండా బాలీవుడ్​లో టాప్ హీరోగా ఎదిగారు. తన 30 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భతమైన సినిమాలతో తన అభిమానులను ఎంతో అలరించాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న షారుక్ ‘పఠాన్’, ‘జావన్’ మూవీస్ తో సెన్షేషనల్ క్రియేట్ చేశాడు, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రజంట్ వరుస చిత్రాలు లైన్‌లో పెట్టాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించే ఎందరో అగ్ర హీరోల జీవితంలో బయటకు చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అయితే షారుక్ జీవితంలో కూడా ఇలాంటి బాధ ఉందట..

Also Read: Nazriya : డివోర్స్ కి సిద్ధం అయిన స్టార్ కపుల్..!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నాడు ‘నా తల్లిదండ్రుల మరణం నా సోదరిపై తీవ్ర ప్రభావం చూపింది నాకిప్పటికి గుర్తుంది. ఆ రోజు తండ్రి మృతదేహం ముందు నిలబడి ఆమె కనీసం ఏడ్వలేదు. ఆమె ఆ బాధ నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అందుకే నేను తనలా డిప్రెషన్కు గురి కాకుండా ఉండటానికి సినిమాల్లో బిజీ అవుతూ ఉంటా. జీవితంలో డబ్బు, స్టార్డమ్ కంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడం ముఖ్యం’ అని చెప్పుకొచ్చారు.

Exit mobile version