Site icon NTV Telugu

Sexual harassment : జగిత్యాల జానీ రైటర్ సుద్దాలపై లైంగిక వేధింపులు కేసు..

Untitled Design (13) (2)

Untitled Design (13) (2)

తమ కళని నమ్ముకుని ఎన్నో కలలు కంటూ సినిమా ఇండస్ట్రీలో రాణించాలని బోలెడన్ని ఆశలుతో వస్తారు. అలా వచ్చే వారి అవసరాన్ని అవకాశం గా మార్చుకుని బెదిరించి, భయపెట్టి తమ లైంగిక వాంఛలు తీర్చుకోవాలనుకునే ప్రబుద్ధులు ఎందరో ఉన్నారు. జాతీయ అవార్డు సైతం అందుకుని కామకోరిక తీర్చనందుకు ఓ యువతిని బెదిరించి అత్యాచారం చేసినందుకు నేడు కటకటాల వెనుక ఊచలు లెక్కేస్తున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.

తాజాగా ఇటివంటి ఉదంతమే జగిత్యాలలో జరిగింది. జగిత్యాలలో మరో జానీ మాస్టర్ తయారయ్యాడు.లేడీ సింగర్ ను లైంగిక వేధింపులు గురిచేశాడు. ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు రచనలు చేసాడు. తన రచనల ద్వారా లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ జగిత్యాలలోని మామిడి మౌనిక అనే యువతికి సింగర్ గా అవకాశం ఇచ్చాడు. వీరి కాంబోలో వచ్చిన అనేక ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ సాదించాయి. దుబాయ్ వంటి ఇతర దేశాల్లోను ఈవెంట్స్ నిర్వహించారు.

ఇదిలా ఉండగా సుద్దాల మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు చేసారు జగిత్యాల పోలీసులు. అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు గురి చేస్తున్నాడని మల్లిక్ తేజ్ పై సింగర్ మామిడి మౌనిక ఫిర్యాదు చేసింది. తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ ఐడీలు పాస్వర్డ్ మార్చి, తనను మాసికంగా వేధిస్తున్నాడంటూ జగిత్యాల  పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది సింగర్ మౌనిక. అలానే తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, స్టూడియోలో పలుసార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది సింగర్ మౌనిక.

Exit mobile version