Site icon NTV Telugu

Bollywood : బాలీవుడ్‌ యంగ్ లవ్ బర్డ్స్ కు సీనియర్ నిర్మాత సలహా

Bollywood

Bollywood

బాలీవుడ్‌లో యంగ్ భామలంతా సోలోగా లేరు. ఎవరితో ఒకరితో మింగిల్ అవుతున్నారు. అందులోనూ యంగ్ బ్యూటీస్ అస్సలు ఖాళీగా లేరు. జాన్వీ శిఖర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో ఉంటే ఆమె సోదరి ఖుషీ కపూర్ యంగ్ హీరో వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తుందని టాక్. వీరి ఫ్రెండ్ అనన్య పాండే కూడా ఖాళీగా లేదు. తారా సుతారియా వీర్ పహారియాతో విహరిస్తుంటే అప్ కమింగ్ బ్యూటీ షారూఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్.. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందతో లవ్ ట్రాక్ నడుపుతుందని టాక్. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరింది మరో బ్యూటీ. సైయారాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న అనీత్ పద్దా కోస్టార్ అహన్ పాండేతో రియల్ లైఫ్‌లో కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ చేసినట్లు సమాచారం.

Also Read : Siddhu Jonnalagadda : ‘తెలుసు కదా’ ఓటీటీ డీల్ క్లోజ్.. జాక్ పాట్ కొట్టిన నిర్మాత

సైయారాతో బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న అహన్ పాండే- అనీత్ పద్దా ఇష్క్ .. కాదల్ అంటూ ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారట. ఇద్దరు కలిసి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారన్నది బీటౌన్ లేటెస్ట్ బజ్. అయితే మీ ప్రేమను బయటకు చెప్పొద్దని సలహా ఇచ్చాడట ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా. అందుకే రహస్యంగా ప్రేమించుకుంటున్నారన్నది టాక్. సైయారా షూటింగ్ టైంలోనే వీరి పరిచయం ప్రేమగా చిగురించిందని తెలుస్తుంది.  సైయారాతోనే హీరోగా ఎంట్రీగా ఇచ్చాడు అనన్య పాండే సోదరుడు అహన్ పాండే. అనీత్ పద్దాకు ఇది సెకండ్ ఫిల్మైనా ఫీమేల్ లీడ్‌గా ఫస్ట్ మూవీ. అహన్ పాండే నెక్ట్స్ ప్రాజెక్ట్ టాక్స్ జరుగుతున్నాయి. అనీత్.. మడాక్ ఫిల్మ్ బ్యానర్‌లో నటించబోతోందని తెలుస్తోంది. బీటౌన్‌లో రోజుకొక కొత్త లవ్ స్టోరీ పురుడు పోసుకుంటూనే ఉంటుంది. అయితే ఆ లవ్ పెళ్లి పీటల వరకు రావటం కష్టం. వీళ్లు కచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్న జంటలు విడిపోయాయి. వీళ్లది టైమ్ పాస్ ప్రేమలు అని ఎక్స్ పెక్ట్ చేసినవి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టినవి ఉన్నాయి. మరి వీరి ప్రేమ ఎంత వరకు సాగుతుందో చూడాలి

Exit mobile version