Bollywood : బాలీవుడ్ యంగ్ లవ్ బర్డ్స్ కు సీనియర్ నిర్మాత సలహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో యంగ్ భామలంతా సోలోగా లేరు. ఎవరితో ఒకరితో మింగిల్ అవుతున్నారు. అందులోనూ యంగ్ బ్యూటీస్ అస్సలు ఖాళీగా లేరు. జాన్వీ శిఖర్ పహారియాతో పీకల్లోతు ప్రేమలో ఉంటే ఆమె సోదరి ఖుషీ కపూర్ యంగ్ హీరో వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తుందని టాక్. వీరి ఫ్రెండ్ అనన్య పాండే కూడా ఖాళీగా లేదు. తారా సుతారియా వీర్ పహారియాతో విహరిస్తుంటే అప్ కమింగ్ బ్యూటీ షారూఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్.. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందతో లవ్ ట్రాక్ నడుపుతుందని టాక్. ఇప్పుడు వీరి జాబితాలోకి చేరింది మరో బ్యూటీ. సైయారాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న అనీత్ పద్దా కోస్టార్ అహన్ పాండేతో రియల్ లైఫ్‌లో కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ చేసినట్లు సమాచారం.
Also Read : Siddhu Jonnalagadda : ‘తెలుసు కదా’ ఓటీటీ డీల్ క్లోజ్.. జాక్ పాట్ కొట్టిన నిర్మాత
Also Read
సైయారాతో బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న అహన్ పాండే- అనీత్ పద్దా ఇష్క్ .. కాదల్ అంటూ ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారట. ఇద్దరు కలిసి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారన్నది బీటౌన్ లేటెస్ట్ బజ్. అయితే మీ ప్రేమను బయటకు చెప్పొద్దని సలహా ఇచ్చాడట ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా. అందుకే రహస్యంగా ప్రేమించుకుంటున్నారన్నది టాక్. సైయారా షూటింగ్ టైంలోనే వీరి పరిచయం ప్రేమగా చిగురించిందని తెలుస్తుంది. సైయారాతోనే హీరోగా ఎంట్రీగా ఇచ్చాడు అనన్య పాండే సోదరుడు అహన్ పాండే. అనీత్ పద్దాకు ఇది సెకండ్ ఫిల్మైనా ఫీమేల్ లీడ్‌గా ఫస్ట్ మూవీ. అహన్ పాండే నెక్ట్స్ ప్రాజెక్ట్ టాక్స్ జరుగుతున్నాయి. అనీత్.. మడాక్ ఫిల్మ్ బ్యానర్లో నటించబోతోందని తెలుస్తోంది. బీటౌన్‌లో రోజుకొక కొత్త లవ్ స్టోరీ పురుడు పోసుకుంటూనే ఉంటుంది. అయితే ఆ లవ్ పెళ్లి పీటల వరకు రావటం కష్టం. వీళ్లు కచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటారు అనుకున్న జంటలు విడిపోయాయి. వీళ్లది టైమ్ పాస్ ప్రేమలు అని ఎక్స్ పెక్ట్ చేసినవి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టినవి ఉన్నాయి. మరి వీరి ప్రేమ ఎంత వరకు సాగుతుందో చూడాలి
తాజావార్తలు
-
ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
ట్రెండింగ్
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!