మాచో హీరో గోపీచంద్, తమన్నా భాటియా జంటగా సంపత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా “సీటిమార్”. “బెంగల్ టైగర్”, “రచ్చ” తర్వాత తమన్నా, సంపత్ నందిల కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ చిత్రం “సీటిమార్”. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ను ప్రకటించారు. ఆగస్టు 20న మధ్యాహ్నం 12:20 గంటలకు బిగ్ అప్డేట్ అని ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.
Read Also : ఆగష్టు 22న మెగా అప్డేట్… అంతా రాజమౌళి చేతుల్లోనే ?
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో తమన్నా కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో నటిస్తోంది. ఇందులో గోపీచంద్ ఆంధ్ర జట్టు కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టు కోచ్‌గా నటిస్తున్నారు. దీనికి శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోపీచంద్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. దర్శకుడు సంపత్ నంది కూడా తిరిగి పుంజుకోవాలని ఆశిస్తున్నాడు. సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ నుంచి వచ్చే బిగ్ అప్డేట్ తప్పకుండా మూవీ రిలీజ్ డేట్ గురించే అంటున్నారు.
