NTV Telugu Site icon

Devara Controversy : అనిరుధ్.. నా పాట కాపీ చేసినందుకు సంతోషంగా ఉంది..?

Untitled Design (87)

Untitled Design (87)

jr .ఎన్టీయార్ హీరోగా రాబోతున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండగా దేవర ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. ఆ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌, అందులో తారక్, జాన్వీ కపూర్ ల మధ్య కెమిస్ట్రీ, విజువ‌ల్స్‌ ఫ్యాన్స్‌కి, ప్రేక్ష‌కుల‌కు పెద్ద ట్రీట్‌ ఇచ్చేలా ఉందనడంలో సందేహం లేదు. మ్యూజిక్‌కి త‌గిన‌ట్లు తారక్, జాన్వీ ల డాన్స్ మూమెంట్స్‌ ఆకట్టుకున్నాయి.

Also Read : Mr.Bachchan: ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్.. కారణం ఇదే..?

కాగా దేవరలోని ఈ సెకండ్ సాంగ్ కు సంబంధించి మ్యూజిక్ పై పలు కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ దేవరకు సంగీతం అందిస్తున్నాడు.సెకండ్ సాంగ్ లోని మ్యూజిక్ కాపీ చేసాడని అందుకు సంబంధించిన ఒరిజినల్ మ్యూజిక్ వీడీయోలను బయటకు తీసి అనిరుధ్ ను టాగ్ చేస్తున్నారు. ఈ సాంగ్ మూడేళ్ళ క్రితం శ్రీలంకన్ సింగర్ పాడిన మాగే హితే కవర్ సాంగ్ లాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఆ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడే అనిరుధ్ ఈ మ్యూజిక్ ను దేవర సెకండ్ సాంగ్ కోసం వాడేసాడని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆ  ఒరిజినల్ సాంగ్   శ్రీలంకన్ మ్యూజిక్ డైరెక్టర్ ‘చమత్ సంగీత్’ అనిరుధ్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. నా సాంగ్ అయిన మాగే హితే ఇన్‌స్పిరేషన్‌ గా అనిరుధ్ కొంచం సిమిలర్ గా అటువంటి సాంగ్ చేయడం తనకు సంతోషంగా ఉందని ఓ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.

Show comments