Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satvika Veeravalli vs Afiya Syed: టాలీవుడ్లో ఇప్పుడు కొత్త హీరోయిన్ల హవా నడుస్తోంది. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుని, స్టార్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తూ యంగ్ బ్యూటీస్ దూసుకుపోతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో ‘కల్పన’గా ఆడియన్స్‌ను ఫిదా చేసిన సాత్విక వీరవల్లికి పోటీగా, ఇప్పుడు ‘రుక్మిణి’గా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్ రంగంలోకి దిగుతోంది. డిసెంబర్ 4న రాబోతున్న ఈ కొత్త అమ్మాయి.. కల్పన రేంజ్ క్రేజ్‌ను అందుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సాత్విక వీరవల్లి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలు సమర్పించాయి. ఇందులో ఆస్ట్రోనాట్ అవ్వాలని కలలు కనే పల్లెటూరి అమ్మాయి ‘కల్పన’ పాత్రలో సాత్విక తన నటనతో కట్టిపడేసింది. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు రావడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయిన సాత్విక, మరో రెండు క్రేజీ ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టింది.
Also Read
మరోవైపు నితిన్ హీరోగా, నేచురల్ స్టార్ నాని (యునానిమస్ ప్రొడక్షన్స్) సమర్పణలో తెరకెక్కిన ‘అలియాస్ రుక్మిణి’ సినిమాతో ముంబై బ్యూటీ ఆఫియా సయ్యద్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్వాలా మేనకోడలు కావడంతో ఈమె ఎంట్రీపై మొదటి నుంచే మంచి బజ్ నెలకొంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆఫియా ‘రుక్మిణి’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. నాని లాంటి జడ్జిమెంట్ ఉన్న హీరో సపోర్ట్ ఉండటంతో ఆఫియా పాత్ర కూడా చాలా స్పెషల్‌గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి సినిమాతోనే కల్పనగా యూత్‌లో క్రేజ్ సంపాదించుకుని, స్టార్ హీరోల సినిమాలను పట్టేస్తున్న సాత్విక వీరవల్లికి.. ఆఫియా సయ్యద్ తన ‘రుక్మిణి’ పాత్రతో గట్టి పోటీ ఇస్తుందా? లేదా అనేది డిసెంబర్ 4న తేలిపోనుంది.
తాజావార్తలు
-
Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
-
Flight: విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం.. గాల్లోకే తిరిగి వెళ్లిపోయిన ఫ్లైట్..
-
కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..
-
Ganja Racket Busted: షిల్లాంగ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి.. ఈగల్ ఫోర్స్‌కు చిక్కిన ముఠా
-
Sudhakaran: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్‌కు ముందు హైడ్రామా.. దుబాయ్ ఐసీయూలో కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్..
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!