Lavanya Tripathi : ‘చిత్తూరు పిల్ల’నంటున్న మెగా కోడలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్టైనింగ్గానూ తెరకెక్కించినట్టుగా ఆ మధ్య విడుదలైన టీజర్‌ను చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది.
Also Read:Corporate Bookings : సినిమాల్లో కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటి?
Also Read
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే ఈ పాటను చిత్రయూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పాటను వనమాలి రచించగా.. నూతన మోహన్, కృష్ణ తేజస్వీ, రితేజ్ జి రావు సంయుక్తంగా ఆలపించారు. మిక్కీ జే మేయర్ అందించిన బాణీ సుతిమెత్తగా అందరినీ గుండెల్ని తాకేలా ఉంది. ఇక బృందా మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ లిరికల్ వీడియో ఎంతో చూడముచ్చటగా మారింది. పెళ్లి సంబరాల్లో ఈ పాటను ప్లే చేసేలా మేకర్లు తెరకెక్కించారు.
Also Read:Coolie : ఫ్రీగా ‘కూలీ’ టికెట్లు.. ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేసి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!