Site icon NTV Telugu

“సర్కారు వారి పాట” టీజర్ అప్డేట్

Sarkaru Vaari Paata Teaser cut has been locked

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే “సర్కారు వారి పాట” ఫస్ట్ లుక్ అంటూ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్ సూపర్ స్టార్ అభిమానును ఆకట్టుకుంది. ఈ సినిమాను 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. మొత్తానికి సంక్రాంతి బరిలో మహేష్ బాబు కూడా “సర్కారు వారి పాట” పడబోతున్నాడు. ఇక గత నాలుగైదు రోజులను నుంచి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయమై ఏ వార్త వచ్చినా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో “సర్కారు వారి పాట” టీజర్ కు సంబంధించిన ఫైనల్ కట్ అయిపోయిందని, ప్రస్తుతం అది ఆర్ఆర్ స్టేజ్ లో ఉందని సమాచారం. ఇక సూపర్ అభిమానులూ ఆగష్టు 9న అన్ని రికార్డులను సెట్ చేయడానికి రెడీగా ఉండండి మరి.

Read Also : బ్లేజర్‌ బటన్స్ విప్పేసి పూజాహెగ్డే రచ్చ..!

“సర్కారు వారి పాట”లో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version