మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కు మంచి ఆదరణ లభించింది.
Also Read : Mega Star : విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల
ఇటీవల కోర్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రియాదర్షి నుండి రానున్న సినిమా కావడంతో సారంగపాణి జాతకంపై మంచి అంచనాలే ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్నఈ సినిమా మొదట ఏప్రిల్ 18న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు. ఆ డేట్ ను మేకర్స్ అధికారంగా ప్రకటించారు. అయితే అనుకోని కారనాల వలన సారంగపాణి జాతకం సినిమా రిలీజ్ ను వాయిదా వేసారు మేకర్స్. ఈ నెల 25న విడుదల చేస్తామని అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్ తో కలిసి చూసేలా అద్భుతంగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్ ను అందుకు తగ్గట్టే ఉన్నాయి. వేసవిలో హాయిగా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే చిత్రమని ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే సినిమా అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న ప్రియ దర్శి ఎలాంటి హిట్ కొడతాడో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.