Site icon NTV Telugu

Sankranti Winner 2026: బ్లాక్‌బస్టర్ ర్యాంపేజ్‌.. సంక్రాంతి విజేత ‘నారి నారి నడుమ మురారి’!

Sankranti Winner 2026

Sankranti Winner 2026

ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలే వచ్చాయి. ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రోజుల వ్యవధిలో విడుదలైన ఈ ఐదు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే కొన్ని సినిమాలు కలెక్షన్స్‌లో సత్తాచాటుతుండగా.. మరికొన్ని అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడంలో దూసుకెళుతున్నాయి. ఈ జాబితాలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి మొదటి స్థానంలో ఉంది.

2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించిన చిత్రంగా ‘నారి నారి నడుమ మురారి’ నిలుస్తోంది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా చప్పట్ల మోత, విజిల్స్‌తో థియేటర్స్ మార్మోగుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకూ అందరినీ ఆకట్టుకుంటూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ ర్యాంపేజ్‌లో దూసుకెళ్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొత్త స్థాయిలో డిఫైన్ చేస్తోందనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా శర్వానంద్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కథనంలో ఉన్న హాస్యం, ఎమోషన్, డ్రామా అన్నీ.. సినిమాను పూర్తి స్థాయి పండుగ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి. శర్వాతో పాటు సమ్యూక్త, సాక్షి వైద్య కీలక పాత్రల్లో మెప్పించారు.

Also Read: Funky Release Date: ‘ఫంకీ’ కొత్త పోస్టర్.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

నారి నారి నడుమ మురారి చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా.. కథనం, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని ప్రశంసలు అందుతున్నాయి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా యాజిన్ నిజార్ గాత్రంతో వచ్చిన పాటలు థియేటర్లలో మంచి స్పందన పొందుతున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయగా.. బాక్సాఫీస్ వద్ద కూడా అంచనాలకు మించిన వసూళ్లు రాబడుతోంది. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, పండుగ వైబ్ అన్నింటిని సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ‘బొమ్మా బ్లాక్‌బస్టర్’ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించిన చిత్రంగా ‘నారి నారి నడుమ మురారి’ నిలిచిందని ఫాన్స్ అంటున్నారు.

Exit mobile version