వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇప్పటికే సినిమాకి 46 కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్షన్స్ వచ్చాయని సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. 46 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడంతో షేర్ కూడా గట్టిగానే వచ్చినట్లు భావిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే ఇది అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా అని చెబుతున్నారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో సినిమాకి టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పల్లెటూర్లలోని కొన్ని థియేటర్లలో ఫిక్స్డ్ సీట్లతో పాటు కొన్ని ప్లాస్టిక్ కుర్చీలను కూడా వేసి షోలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఫీట్ ఎప్పుడో బెనిఫిట్ షోలకు అది కూడా పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే కనిపించేది.
Mirai : మిరాయ్ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. వారియర్ లుక్ లో తేజ సూపర్బ్
కానీ ఒక సీనియర్ హీరో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో మళ్లీ అదే ఫీట్ రిపీట్ అవుతుంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. వెంకటేష్ సరసన హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి నటించారు. యానిమల్ నటుడు ఉపేంద్ర ట్రాక్ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అదే విధంగా సినిమాలో చర్చించిన ఒక పాయింట్ కూడా ప్రేక్షకులను ఆలోచింపచేస్తూ ఉండడంతో ఈ సినిమా రన్ ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించడం లేదు. వచ్చేవారం కూడా పెద్దగా సినిమాలు బరిలో లేకపోవడంతో ఈ సినిమాకి లాంగ్ రన్ కచ్చితంగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే దిల్ రాజు ప్లానింగ్ కూడా కలిసి వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గేమ్ చేంజర్ తో పాటు డాకు మహారాజ్ సినిమాకి కేటాయించిన కొన్ని థియేటర్లను తప్పించి ఈ సినిమాకి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
Sankranthiki Vasthunam Craze: Extra chair's adding in few Theater's for Venkatesh Mania @VenkyMama@AnilRavipudi#SankranthikiVasthunam @aishu_dil @Meenakshiioffl @DilRajuProdctns pic.twitter.com/bJPfYXDLVb
— BhaRGV (@BhargavChaganti) January 15, 2025