Sangeeth Sobhan: నిహారిక లేకపోతే.. సంగీత్ శోభన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోన్న రాకాస
- డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్ మీట్‌లో సంగీత్ సంతోషం
- ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందమేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ నటుడు సంగీత్ శోభన్ హీరోగా నటించిన ‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి.. రెండవ వారంలోనూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్ల సక్సెస్ మీట్‌లో సంగీత్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా బిజినెస్‌లో డిస్ట్రిబ్యూటర్ల పాత్ర ఎంత కీలకమో వివరించాడు. సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి నిర్మాత నిహారిక కొణిదెల చూపిన చొరవే అని సంగీత్ కొనియాడాడు.
‘సినిమా మీద ఉన్న పిచ్చి, ప్రేమతోనే డిస్ట్రిబ్యూటర్లు సినిమాలను కొంటారు. సినిమా ఫలితం వల్ల మొదట ప్రభావితం అయ్యేది వారే. డిస్ట్రిబ్యూటర్ సంతోషంగా ఉంటేనే సినిమా నిజంగా హిట్టైనట్టు నేను భావిస్తాను. రాకాస చిత్రాన్ని నమ్మి కొనుగోలు చేసిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా విజయానికి నిదర్శనం థియేటర్ల సంఖ్యే. రెండో వారంలో కూడా మా సినిమాకు మంచి స్క్రీన్లు లభించడం మా విజయానికి నిదర్శనం. నేను స్వయంగా థియేటర్ విజిట్స్‌కి వెళ్లినప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందమేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అని సంగీత్ శోభన్ చెప్పాడు.
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
Also Read: Niharika Konidela: డిస్ట్రిబ్యూటర్ల ఆనందమే అసలైన విజయం.. ప్రతీ ఒక్కరికీ థాంక్స్!
ఈ ప్రాజెక్ట్ ఇంతటి ఘన విజయం సాధించడానికి నిర్మాత నిహారిక కొణిదెల చూపిన చొరవను మరవలేమని సంగీత్ శోభన్ పేర్కొన్నాడు. ‘నిహారిక గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత దూరం వచ్చేది కాదు. ఆమె అందించిన సపోర్ట్ మర్చిపోలేనిది. అలాగే సీనియర్ నటుడు బ్రహ్మాజీ గారితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన మీడియాకు, అతిథిగా వచ్చిన మైత్రి రవి గారికి, టీమ్ సభ్యులందరికీ థాంక్స్’ అని సంగీత్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!