NTV Telugu Site icon

Sandal Wood: ఇదెక్కడి విడ్డూరం.. కుక్క సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడైనా చూసారా..?

Untitled Design 2024 08 12t085335.950

Untitled Design 2024 08 12t085335.950

శాండిల్ వుడ్ లో 2020లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రం ‘నాను మత్తు గుండా’. శ్రీనివాస్ తిమ్మయ్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరెకెక్కింది. ఒక ఆటో డ్రైవర్ , గుండా అనే ఒక కుక్కను అనుకుండా పెంచుకోవడం అతని భార్య కవితకు అసూయను కలిగిస్తుంది. ఈ ముగ్గురి జీవితాలు ఒకదానికొకటి ముడిపెట్టి ప్రేక్షకుల హృదయాన్ని కదిలించే విధంగా ఈ సినిమాను నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఆ సినిమాకు సిక్వెల్ రాబోతుంది. గుండను ప్రేమించి పట్టించుకునే కథానాయకుడు శంకర్ మరణానంతరం గుండ ఎటు వెళ్ళింది,తన ప్రయాణాన్ని ఎలా సాగించిందనే కథాంశంతో ఈ సిక్వెల్ రానున్నట్టు దర్శకుడు రఘు హాసన్ తెలిపాడు. ఇప్పటికే మైసూరు పరిసరాల్లో ఈ చిత్ర షూటింగ్ చేసారు మేకర్స్.

Also Read: Tollywood: హమ్మయ్య.. ఆ సినిమాకు ఇక టెన్షన్ తీరిపోయినట్టే..

ఈ సిక్వెల్ కు సంబంధించి షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ పనులు మొదలు పెట్టింది యూనిట్. ఈ సిక్వెల్ సినీ చరిత్రలో తొలిసారి ఓ కుక్క తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పింది. ‘నాను మత్తు గుండ-2’లో లాబ్రాడర్ జాతికి చెందిన కుక్క ముఖ్య పాత్రను పోషిస్తుంది. చిత్ర నటుడు రాకేశ్ అడిగతో పాటు ఓ  కుక్క ‘సింబా’ పాత్రలో లీడ్ రోల్ లో కనిపించనుంది. సింబా పాత్రకు శునకం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం ఏం చెప్పాలి. ఈ మూవీ కన్నడ, తెలుగు, హిందీ తదితర భాషల్లో రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు.ఈ సీక్వెల్‌కు టాలీవుడ్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. అసలు ఎలా డబ్బింగ్ చెప్పింది, ఆలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

Show comments