NTV Telugu Site icon

Devil: కళ్యాణ్‌ రామ్ సరసన మరోసారి సంయుక్త మీనన్!

Devil

Devil

Devil: మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కు ఇప్పుడు టైమ్ బాగుంది. ‘భీమ్లానాయక్’ మూవీతో ఏ ముహూర్తాన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందో కానీ… చక్కని విజయాన్ని అందుకోవడంతో పాటు… ‘బింబిసార’లోనూ ఛాన్స్ పొందింది. నిజం చెప్పాలంటే… సంయుక్త మీనన్ ముందుగా సైన్ చేసిన సినిమా ఇదేనట. అయితే ‘భీమ్లా నాయక్’ ముందు రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు మరోసారి కళ్యాణ్ రామ్ సరసన నటించబోతోంది. అది కూడా వేరొకరిని రీప్లేస్ చేసి!

Read also: Playing Poker: పేకాట ఆడుతున్న 16 మంది అరెస్ట్‌.. 13లక్షలు స్వాధీనం

ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్ ‘డెవిల్’ అనే మూవీలో నటిస్తున్నాడు. దీన్ని అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బేసికల్ గా వి.ఎఫ్.ఎక్స్. నిపుణుడైన నవీన్ మేడారంకు దర్శకత్వం అంటే కూడా మక్కువే. ఆ మధ్య హిందీ సినిమా ‘హంటర్’ను తెలుగులో ‘బాబు బాగా బిజీ’ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా తెలుగులో అంతగా నడవకపోయినా… దాని నిర్మాత అభిషేక్ నామా కు మాత్రం నవీన్ మేడారంపై నమ్మకం ఏర్పడింది. అందుకే నందమూరి కళ్యాణ్ రామ్ తో తీస్తున్న ‘డెవిల్’కు అతన్నే డైరెక్టర్ గా పెట్టుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా యుక్తి తరేజాను పెట్టుకున్నారు. కారణం తెలియదు కానీ ఆమెను తప్పించి, ఇప్పుడు సంయుక్త మీనన్ కు ఛాన్స్ ఇచ్చారు. ‘బింబిసార’లో కళ్యాణ్‌ రామ్ సరసన నటించిన సంయుక్త మీనన్ కు అందులో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. బట్ ఇందులో ఆమెది కీ-రోల్ అట! అయితే ‘బింబిసార’ మూవీ సక్సెస్ కావడంతో ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. అలానే ‘భీమ్లా నాయక్’ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, తెలుగు, తమిళ భాషల్లో ధనుష్‌ తో తీస్తున్న ‘సర్’ మూవీలోనూ సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్ అదే పనిచేశారు. మొత్తం మీద ఆమెతో తెలుగు సినిమాలు చేసిన ఇద్దరూ సెకండ్ ఛాన్స్ ఇవ్వడం విశేషమే!
Jahnvi Kapoor : ఎన్టీఆర్‌ నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను

Show comments