Site icon NTV Telugu

Samantha : సమంత తండ్రి మృతి.. కారణం ఏంటంటే..?

Samantha

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తండ్రి జోలెఫ్ ప్రభు ఈ రోజు మృతి చెందారు. ఆ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసారు సమంత. గత కొంత కాలంగా సమంత తండ్రి జోసెఫ్ అనారోగ్య కారణాలతో భాదపడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబాయి లో ఉంటుంది. తండ్రి మరణ వార్త తెలియగానే హూటా హుటిన కేరళలోని తన స్వస్థలానికి చేరుకుంది.

చాలా కాలంగా సమంత షూటింగ్ నిమిత్తం కుటుంబ సభ్యులకు దూరంగా కొన్నాళ్ళు హైదరాబాద్ లో మరికొన్ని రోజులు ముంబాయి లో ఉంటోంది. సమంతకు సానుభూతి తెలియజేస్తూ ఆమె అభిమానులు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.  తన తండ్రి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూ లో సామ్ మాట్లాడుతూ ఆయన నన్నుఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. నా మొదటి సినిమా చేసే టైమ్ లో అసలు నేను యాక్టింగ్ చేయగలనా అని బయపడిపడినప్పుడు ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ తర్వాత నేను నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక నన్ను చూసి ఆయన ఎంతగానో ఆనందించారు’ అని అన్నారు.

Exit mobile version