కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో సెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ సమయంలో సమంత అక్కినేని వర్కౌట్స్ వీడియో వైరల్ అవుతోంది. సామ్ యోగా, ప్రాణాయామం చేస్తున్న వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. మంగళవారం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ఉదయ వ్యాయామం దినచర్యను పంచుకుంది. ఉదయం 7.32 గంటలకు సామ్ చేసిన హెడ్ స్టాండ్ వ్యాయామం వీడియో, పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా సమంత చివరిసారిగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ ‘జాను’ చిత్రంలో కన్పించింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శాకుంతలం’ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో ఆమె దేవ్ మోహన్ తో స్క్రీన్ స్పేస్ పంచుకోనుంది. ఇంకా దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాతువాకుల రెండు కాదల్’ అనే తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించారు. సమంత ఈ సంవత్సరం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో డిజిటల్ అరంగేట్రం చేయనుంది.