Samantha : డేటింగ్ నుంచి వెడ్డింగ్ దాకా..సైలెంట్‌గా షాకిచ్చిన సమంత ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. నాగచైతన్య తో విడాకుల తర్వాత, చాలా కాలంగా సింగిల్‌గా ఉంటూ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంత.. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారని టాక్. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సీక్రెట్‌గా డేటింగ్ చేస్తోందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల సమంత – రాజ్ కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలకు బలంగా పుంజుకున్నాయి. ఒక ఫోటోలో రాజ్, సమంత భుజంపై చేయి వేసి, ఇద్దరు ఆప్యాయంగా నవ్వుకుంటూ ఉండటం చూసిన నెటిజన్లు.. ఇది కేవలం స్నేహం కాదు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Mohan Babu: నా మార్పుకు కారణం రజినీకాంత్..
Also Read
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్‌డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
సమాచారం ప్రకారం ఇప్పటికే పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మొదట ఆగస్ట్‌లో పెళ్లి అనుకున్నప్పటకి,. సమంత అక్టోబర్ 6న తన రెండో పెళ్లిని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డేట్‌ను చూసి చాలామందికి షాక్ తగిలింది. ఎందుకంటే సమంత – నాగచైతన్యలు కూడా అక్టోబర్ 6నే పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ సారి పెళ్లి ఎలాంటి హంగామా లేకుండా సాదా చర్చిలో జరగబోతుందని, ఇరువురు సన్నిహితుల సమక్షంలో మాత్రమే కార్యక్రమం జరిగే అవకాశం ఉందంటున్నారు.
కానీ దీనిపై సమంత గానీ, రాజ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సామ్ ఎంతో జాగ్రత్తగా తన ప్రాజెక్టులు ఎంచుకుంటుంది. అన్నీ కలిపి చూస్తే, సమంత జీవితం మరో కొత్త దశలోకి అడుగు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ప్రేమ, పెళ్లి, కెరీర్ అన్నీ తన నియంత్రణలోనే ఉండేలా చూసుకుంటుందనిపిస్తోంది. మరి అక్టోబర్‌లో ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుందా? లేక ఇది కూడా ఓ పుకారేనా? అనేది త్వరలోనే తేలనుంది.
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!