Site icon NTV Telugu

Samantha : డేటింగ్ నుంచి వెడ్డింగ్ దాకా..సైలెంట్‌గా షాకిచ్చిన సమంత ?

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోనుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. నాగచైతన్య తో విడాకుల తర్వాత, చాలా కాలంగా సింగిల్‌గా ఉంటూ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంత.. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారని టాక్. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సీక్రెట్‌గా డేటింగ్ చేస్తోందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల సమంత – రాజ్ కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలకు బలంగా పుంజుకున్నాయి. ఒక ఫోటోలో రాజ్, సమంత భుజంపై చేయి వేసి, ఇద్దరు ఆప్యాయంగా నవ్వుకుంటూ ఉండటం చూసిన నెటిజన్లు.. ఇది కేవలం స్నేహం కాదు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Mohan Babu: నా మార్పుకు కారణం రజినీకాంత్..

సమాచారం ప్రకారం ఇప్పటికే పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మొదట ఆగస్ట్‌లో పెళ్లి అనుకున్నప్పటకి,. సమంత అక్టోబర్ 6న తన రెండో పెళ్లిని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డేట్‌ను చూసి చాలామందికి షాక్ తగిలింది. ఎందుకంటే సమంత – నాగచైతన్యలు కూడా అక్టోబర్ 6నే పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ సారి పెళ్లి ఎలాంటి హంగామా లేకుండా సాదా చర్చిలో జరగబోతుందని, ఇరువురు సన్నిహితుల సమక్షంలో మాత్రమే కార్యక్రమం జరిగే అవకాశం ఉందంటున్నారు.

కానీ దీనిపై సమంత గానీ, రాజ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సామ్ ఎంతో జాగ్రత్తగా తన ప్రాజెక్టులు ఎంచుకుంటుంది. అన్నీ కలిపి చూస్తే, సమంత జీవితం మరో కొత్త దశలోకి అడుగు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ప్రేమ, పెళ్లి, కెరీర్ అన్నీ తన నియంత్రణలోనే ఉండేలా చూసుకుంటుందనిపిస్తోంది. మరి అక్టోబర్‌లో ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుందా? లేక ఇది కూడా ఓ పుకారేనా? అనేది త్వరలోనే తేలనుంది.

Exit mobile version