NTV Telugu Site icon

Samantha : ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సమంత..

Samantha (6)

Samantha (6)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..తెలుగు తెరమీద కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికి ప్రేక్షకుల్లో ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. పరిస్థితులు అనుకూలించక ప్రజంట్ కొంచెం వినపడింది కానీ.. అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి కావల్సినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అందుకే సామ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న అభిమానులు ఇంకా ఆమెను అంతే ప్రేమగా ఆరాధిస్తున్నారు. ఇక ఈ మధ్య కోలుకుంటున్న సమంత తన దృష్టి మొత్తం కెరీర్ మీద పెట్టింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఎక్కువగా వార్తలో నిలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.

Also Read:Prudhvi Raj : వారు ఇచ్చిన నమ్మకమే నన్ను నడిపించింది..

రీసెంట్ గా ‘ హనీ-బన్నీ’ సిరీస్ లో ఉత్తమ నటన కనబరిచినందుకు ఓ మీడియా సంస్థ సమంతకు ( ఓటీటీ ఉత్తమ నటి) గా అవార్డు అందించింది. దీన్ని గెలుచుకోవడం పై సంతోషం వ్యక్తం చేసింది సామ్.. ‘నాకు దక్కిన ఈ గౌరవాన్ని అమూల్యంగా భావిస్తున్నాను. చెప్పాలి అంటే నాకు ఇష్టమైన ఎంతోమంది నటీమణులు ఈ అవార్డుల నామినీ బరిలో ఉన్నారు. నిజానికి ఈ సిరీస్‌ను పూర్తి చేయడమే నాకు అవార్డు లాంటిది. ఎందుకంటే ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య దీన్ని పూర్తి చేశాను. నన్ను నమ్మిన వారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్ కారణంగానే నేను సిటడెల్ హనీ-బన్నీ ను పూర్తి చేయగలిగాను. ఈ సిరీస్‌ను కంప్లీట్ చేయడం కోసం ఎంతో ఓపికతో వ్యవహరించారు. ఇది అంత సులభం కాదని నాకు తెలుసు. ముఖ్యంగా నన్ను వారంతా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ విషయంలో వారికి కృతజ్ఞతలు’ అని సమంత తెలిపింది.