ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత రూత్ ప్రభు. అనతి కాలంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్‌లతో ధూసుకుపోతు తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కానీ ఎవ్వరి లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. సమంత లైఫ్ మాత్రం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. రిలేషన్ బ్రేక్ అవ్వడం.. అనారోగ్యం ఇలా దెబ్బ మీద దెబ్బ పడటం తో కెరీర్ పై చాలా ఎఫెక్ట్ అయింది. కానీ ప్రతి సంఘటనను ఎంతో ధైర్యంగా ఎదురుకున్న సామ్ తిరిగి ఫామ్ లోకి వచ్చింది. కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాదు పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గోంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటుంది. అయితే తాజాగా తన సినీ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో తన తొలి రోజుల అనుభవాలను, మార్పులు పరిశ్రమలో ఎదుర్కొన్న ఒత్తిడిని నిజాయితీగా పంచుకుంది.
Also Read : Priyamani: పాత్రను బట్టి నా డిమాండ్ ఉంటుంది – ప్రియమణి
సమంత మాట్లాడుతూ.. “నా కెరీర్ ప్రారంభంలో చాలా గ్లామరస్ పాత్రలు చేశాను. కానీ నిజం చెప్పాలంటే ఆ పాత్రలో నేను సౌకర్యంగా లేను. అవి నాకు అసౌకర్యంగా అనిపించేవి. ఇతర హీరోయిన్లలా కనిపించడానికి, వారిలా ప్రవర్తించడానికి, వారిలా నాట్యం చేయడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ ప్రదర్శనలు నాకు నవ్వు తెప్పిస్తాయి. కానీ అదే నా లెర్నింగ్ జర్నీ . నను ఎవరూ గైడ్ చేయలేదు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ప్రతి తప్పిదం, ప్రతి అసౌకర్యం నాకు ఏదో ఒకటి నేర్పింది. ఆ అనుభవాలే నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకు వచ్చాయి. పదిహేను సంవత్సరాల కాలం ఎలా గడిచిందో తెలియదు కానీ వాటిలో కొన్ని శాశ్వతమైన మధుర జ్ఞాపకాలు, మరికొన్ని మరిచిపోలేని సవాళ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను మరింత దృఢంగా, మరింత నమ్మకంగా ఉన్నాను. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను తగ్గించలేను కానీ వాటిని ఎదుర్కోవడం నేర్చుకున్నాను. రాబోయే పదిహేను సంవత్సరాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి అని నమ్ముతున్నాను. నటనతో పాటు వ్యాపారం, వెల్‌నెస్, ట్రావెల్ ఇవన్నీ కవర్ చేయడం మునుపటి కంటే సులభంగా అనిపిస్తుంది. గతంలో కేవలం నటనపై దృష్టి పెట్టడం ఎక్కువ ఒత్తిడిగా అనిపించేది, కానీ ఇప్పుడు జీవితం చాలా నేర్పించింది’ తన కెరీర్ పట్ల, వ్యక్తిగత మార్పుల పట్ల ఇంత స్పష్టంగా మాట్లాడిన సమంత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
