Site icon NTV Telugu

Maa Inti Bangaram: రాజ్ నిడిమోరుతో కలిసి సమంత కొత్త సినిమా పూజ

Smantha Raj Nidimoru

Smantha Raj Nidimoru

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కథానాయికగా నటిస్తూనే, నిర్మాతగా కూడా మారారు. ‘ట్రాలాలా’ (Tralala) పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత, తన స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభించారు. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తన స్నేహితురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Prema Ledhani: సినిమా రివ్యూలు చెప్తూ హీరో అయ్యాడు.. టీజర్ రిలీజ్!

ఈ కార్యక్రమానికి సమంతతో పాటు దర్శకురాలు నందిని రెడ్డి, చిత్ర బృందం హాజరయ్యారు. అయితే, అందరి దృష్టినీ ఆకర్షించిన వ్యక్తి ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ & డీకే ఫేమ్). పూజా కార్యక్రమంలో సమంత పక్కనే రాజ్ నిడిమోరు కూర్చుని పూజలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Also Read : OTT: ఓటీటీలూ చేతులెత్తేశాయ్

ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా వీరిద్దరూ సినిమా పూజలో పక్కపక్కనే దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. అయితే, ఇందులో మరో కోణం కూడా ఉంది. సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ‘మా ఇంటి బంగారం’ సినిమాకి రాజ్ నిడిమోరు ‘క్రియేటివ్ ప్రొడ్యూసర్’గా కూడా పనిచేస్తున్నారు. దీంతో, ఆయన కేవలం క్రియేటివ్ ప్రొడ్యూసర్ హోదాలోనే పూజలో పాల్గొన్నారా? లేక సమంత డేట్ చేస్తున్న వ్యక్తిగా హాజరయ్యారా? అనే విషయంలో ప్రస్తుతం క్లారిటీ కొరవడింది. ఏదేమైనా, నిర్మాతగా సమంత ప్రారంభించిన మొదటి సినిమా కావడంతో పాటు, రాజ్ నిడిమోరు ఉనికితో ‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్ట్ ప్రారంభం రోజే వార్తల్లో నిలిచింది.

Exit mobile version