Site icon NTV Telugu

Samantha: ఫిట్‌నెస్‌ అంటే ఇదే.. డెడ్‌హ్యాంగ్‌ ఛాలెంజ్‌తో అదరగొట్టిన సమంత !

Samantha (2)

Samantha (2)

అగ్ర కథానాయిక సమంత తన ఫిట్‌నెస్ పట్ల చూపించే ఆసక్తి, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే 100 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ షాక్‌కు గురి చేసిన సమంత, తాజాగా మరోసారి తన శారీరక సత్తాను నిరూపించారు. ఈసారి ఆమె డెడ్‌హ్యాంగ్‌ ఛాలెంజ్ తీసుకుని 90 సెకన్ల పాటు కండిషనింగ్ పోజిషన్‌లో నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను ఆమె ట్రైనర్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, “మీరు ఎలా కనిపిస్తున్నారు అనే కంటే, ఎవరూ చూడని సమయంలో మీరు ఎంత బలంగా ఉన్నారన్నదే నిజమైన విషయం” అంటూ ఓ అద్భుతమైన సందేశం ఇచ్చారు.

Also Read : War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్ 

సమంత ‘Take 20 Health’ అనే పాడ్‌కాస్ట్ సిరీస్‌లో తరచూ తన ఆరోగ్య, ఫిట్‌నెస్ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలు పంచుకుంటూ ఫిట్‌నెస్ అవేర్‌నెస్‌కు తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘సమంత స్ట్రాంగ్’, ‘రియల్ ఇన్స్ప్రెషన్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజా ఛాలెంజ్‌తో మరోసారి బలంగా ఉండటం అంటే ఏమిటో చూపించింది సమంత. ఆమె ఫిట్‌నెస్‌ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Exit mobile version