Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ కోసం డ్యాన్స్ చేయమంటే సమంత ఏడ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చీరకట్టులో సమంత ఊరమాస్ ఫైట్లు.. ‘మా ఇంటి బంగారం’ కోసం డ్యాన్స్ చేయమంటే ఏడ్చేసింది!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంతతో పాటు సమంత భర్త/నిర్మాత రాజ్ నిడిమోరు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో సమంత చీరకట్టులో అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజ్ మాట్లాడుతూ.. “సమంతతో డ్యాన్స్ చేయించడం అంటే మాకు తలప్రాణం తోకకొచ్చింది. డ్యాన్స్ చేయనని మొండికేస్తే, గట్టిగా పట్టుబట్టడంతో స్కూల్ పిల్లల్లా బొంగమూతి పెట్టుకుని ఏడుస్తూ డ్యాన్స్ చేసింది. కానీ యాక్షన్ సీన్స్ అనగానే మాత్రం ఎప్పుడూ రెడీగా ఉండేది. ఇప్పుడు యాక్షనే ఆమెకు అసలైన కిక్ ఇస్తోంది” అని నవ్వుతూ చెప్పారు.
దీనిపై సమంత స్పందిస్తూ.. “నాకు నిజంగానే డ్యాన్స్ కంటే యాక్షన్ చేయడమే చాలా ఇష్టం. ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ తర్వాతే నాకు యాక్షన్ చేయగలననే నమ్మకం వచ్చింది. నేను చూడటానికి యాక్షన్ హీరోలా ఉండను, కానీ స్క్రీన్ పైన అది బాగా క్లిక్ అయ్యింది. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను మార్చారు” అని పేర్కొంది. కేవలం నటనకే పరిమితం కాకుండా ఈ సినిమాతో ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టడంపై సమంత క్లారిటీ ఇచ్చింది. “ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు సరైన స్క్రిప్ట్స్, అవకాశాలు రావడం లేదని కేవలం మాటల్లో చెబితే సరిపోదు. కంటెంట్ పైన అంత నమ్మకం ఉన్నప్పుడు మనమే స్వయంగా రిస్క్ చేసి డబ్బులు పెట్టాలి. అందుకే ‘శుభం’ సినిమా తర్వాత మా బ్యానర్ లో ఇంత పెద్ద సినిమాను నిర్మించడానికి ధైర్యం చేశాం” అని గర్వంగా చెప్తోంది సామ్.
Also Read
తాజావార్తలు
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ కోసం డ్యాన్స్ చేయమంటే సమంత ఏడ్చేసింది!
-
Samantha : సమంత ‘మా ఇంటి బంగారం’కు పోటీగా దిగుతోన్న నాలుగైదు సినిమాలు
-
OnePlus N6: వన్‌ప్లస్ ఎన్6 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ తేదీన విడుదల, డిజైన్ వెల్లడి
-
Rashmika Mandanna : రష్మిక మూవీకి ‘A’ సర్టిఫికెట్… త్వరలోనే థియేటర్లలోకి
-
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!