Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న సమంత, తన ఆశలన్నీ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’పైనే పెట్టుకుంది. ‘ఓ బేబీ’ వంటి హిట్‌ను అందించిన దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా నిన్ననే (మే 14) విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని జూన్ 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మొదట్లో ఈ నిర్ణయంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. మే నెలలో విడుదల చేస్తే రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద సోలో రన్ దొరికేదని, వాయిదా వేసి మంచి అవకాశాన్ని వదులుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
కానీ ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే సమంత నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య జరుగుతున్న ‘పర్సెంటేజ్ వార్’ కారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు సినిమాలను బహిష్కరించే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ సమంత సినిమా ఇప్పుడు విడుదలయ్యుంటే, థియేటర్ల బంద్ కారణంగా సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేది. రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి భారీ చిత్రమే ఈ వివాదంలో చిక్కుకున్న తరుణంలో, సమంత సినిమాను జూన్ నెలకి వాయిదా వేయడం వల్ల ఈ రిస్క్ నుంచి తప్పించుకున్నట్లయింది. జూన్ 19 నాటికి ఈ వివాదాలు సద్దుమణిగి, పరిస్థితులు చక్కబడే అవకాశం ఉండటంతో సమంత టీమ్ తీసుకున్నది ఒక ‘కాలిక్యులేటెడ్ మూవ్’ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్‌పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!