Samantha: ప్రస్తుతానికి నేను చావలేదు.. కన్నీరు పెట్టుకున్న సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజుల నుంచి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటుంది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఆమె ముఖం చాలా దారుణంగా మారిందని. అసలు సమంతనేనా అంటూ చెప్పుకొచ్చారు. ఆమె చాలా దారుణంగా తయారైందని ఆ వ్యాధి చాలా భయంకరమైనదని సోషల్ మీడియాలో ప్రచారం జోరందు కుంది. తాజాగా సమంత తన ఇస్టా గ్రామ్ లో తన ఫోటో షేర్ చేయడంతో సమంత ముఖం అంతా చాలా దారుణంగా అయ్యిందంటూ వార్తలు వచ్చాయి.
అయితే చికిత్స అనంతరం మొదటిసారి సామ్ కెమెరా ముందుకు వచ్చింది. ఆమె ముఖంలో ఆవెలుగు ఏమాత్రం చెక్కు చెదరలేదు. చందమామలా మెరిసిపోతూ వున్న సమంత పెదవులపై చరునవ్వుతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కానీ.. ఇక ఆమె పోస్టు గురించి సీనియర్ యాంకర్ సుమ అడగడంతో భావోద్వేగానికి గురయ్యారు సమంత. ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని మంచిరోజులు ఉంటాయ, కొన్ని చెడ్డ రోజుల ఉంటాయి అన్నారు. నేను దీనిపై పోరాటం చేయాలని అన్నారు సమంత. నాలా చాలా మంది వున్నారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. నేను ఇంత దాటి వచ్చానా అనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతానికైతే నేను చావలేదని కాసేపు నవ్వుకున్నారు. నేను ఆ వ్యాధితో పోరాడుతున్నా.. అది చాలా కష్టమైన పనే అంటూ చెప్పుకొచ్చారు సమంత. ఒక్కోసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుందని అన్నారు. ఇలా పోరాటం చేస్తున్నది నేను ఒక్కదాన్నేకాదన్నారు. నాలా చాలామంది పోరాటం చేస్తున్నారని అన్నారు.
Also Read
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ఇక యశోద సినిమా గురించి చెప్పుకొచ్చారు సాధారణంగా నేను స్టోరీ సెలెక్ట్ చేయడంలో బాగా ఆలోచిస్తానని అన్నారు. పదే పదే ఒకే క్యారెక్టర్ చేయడానికి నేను ఇష్టపడనంటూ తెలిపారు. రిపీట్ క్యారెక్టర్ అంటే అస్సలు ఇష్టలేదని అన్నారు. నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లలో యశోద్ రోల్ చాలా డిఫరెంట్ .. ఇది త్రిల్లర్ జోనల్ కథ అందరికి నచ్చుతుందని ఈసినిమా చేశానని అన్నారు సమంత. ఇకపోతే యశోద సినిమా నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
అయితే అభిమానులు సమంతను చూసి సమంత ఏమాత్రం మారలేదని, ఆమె చిరునవ్వు ఎప్పటికి తనవెంటే ఉంటుందని, ఆమెకు ధైర్యం ఎక్కువని ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. అయితే మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్ ఎందుకు అని, ప్రాణం కంటే సినిమా ఎక్కువా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా సమంత ఆరోగ్యంతో అభిమానుల కోసం మీడియా ముందుకు రావడం.. చాలా రోజుల తరువాత సమంతను అభిమానులు ఇంత ఆనందగా చూసి దేవుడు ఎప్పుడు తోడుగా వుంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!