NTV Telugu Site icon

Samantha: ప్రస్తుతానికి నేను చావలేదు.. కన్నీరు పెట్టుకున్న సమంత

Samantha

Samantha

Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజుల నుంచి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటుంది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఆమె ముఖం చాలా దారుణంగా మారిందని. అసలు సమంతనేనా అంటూ చెప్పుకొచ్చారు. ఆమె చాలా దారుణంగా తయారైందని ఆ వ్యాధి చాలా భయంకరమైనదని సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందు కుంది. తాజాగా సమంత తన ఇస్టా గ్రామ్ లో తన ఫోటో షేర్‌ చేయడంతో సమంత ముఖం అంతా చాలా దారుణంగా అయ్యిందంటూ వార్తలు వచ్చాయి.

అయితే చికిత్స అనంతరం మొదటిసారి సామ్ కెమెరా ముందుకు వచ్చింది. ఆమె ముఖంలో ఆవెలుగు ఏమాత్రం చెక్కు చెదరలేదు. చందమామలా మెరిసిపోతూ వున్న సమంత పెదవులపై చరునవ్వుతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కానీ.. ఇక ఆమె పోస్టు గురించి సీనియర్‌ యాంకర్ సుమ అడగడంతో భావోద్వేగానికి గురయ్యారు సమంత. ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని మంచిరోజులు ఉంటాయ, కొన్ని చెడ్డ రోజుల ఉంటాయి అన్నారు. నేను దీనిపై పోరాటం చేయాలని అన్నారు సమంత. నాలా చాలా మంది వున్నారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. నేను ఇంత దాటి వచ్చానా అనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతానికైతే నేను చావలేదని కాసేపు నవ్వుకున్నారు. నేను ఆ వ్యాధితో పోరాడుతున్నా.. అది చాలా కష్టమైన పనే అంటూ చెప్పుకొచ్చారు సమంత. ఒక్కోసారి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుందని అన్నారు. ఇలా పోరాటం చేస్తున్నది నేను ఒక్కదాన్నేకాదన్నారు. నాలా చాలామంది పోరాటం చేస్తున్నారని అన్నారు.

ఇక యశోద సినిమా గురించి చెప్పుకొచ్చారు సాధారణంగా నేను స్టోరీ సెలెక్ట్ చేయడంలో బాగా ఆలోచిస్తానని అన్నారు. పదే పదే ఒకే క్యారెక్టర్ చేయడానికి నేను ఇష్టపడనంటూ తెలిపారు. రిపీట్‌ క్యారెక్టర్‌ అంటే అస్సలు ఇష్టలేదని అన్నారు. నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లలో యశోద్‌ రోల్‌ చాలా డిఫరెంట్ .. ఇది త్రిల్లర్‌ జోనల్‌ కథ అందరికి నచ్చుతుందని ఈసినిమా చేశానని అన్నారు సమంత. ఇకపోతే యశోద సినిమా నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

అయితే అభిమానులు సమంతను చూసి సమంత ఏమాత్రం మారలేదని, ఆమె చిరునవ్వు ఎప్పటికి తనవెంటే ఉంటుందని, ఆమెకు ధైర్యం ఎక్కువని ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. అయితే మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్ ఎందుకు అని, ప్రాణం కంటే సినిమా ఎక్కువా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా సమంత ఆరోగ్యంతో అభిమానుల కోసం మీడియా ముందుకు రావడం.. చాలా రోజుల తరువాత సమంతను అభిమానులు ఇంత ఆనందగా చూసి దేవుడు ఎప్పుడు తోడుగా వుంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show comments