Samantha : సౌత్‌లో బిజీగా సమంత.. ఈ నెలలోనే స్టార్ట్ కాబోతున్న మా ఇంటి బంగారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళ్లీ సమంత సౌత్ ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తుందా అంటే ఔననే టాక్ వినిపిస్తోంది. ఖుషి తర్వాత కనిపించని సామ్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ‘శుభం’లో మాయగా మెరిసింది. ట్రలాలా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం తెరకెక్కించి నిర్మాతగా డీసెంట్ హిట్ కొట్టేసింది. ఇక ఇదే నిర్మాణ సంస్థలో ఎనౌన్స్ చేసిన ‘మా ఇంటి బంగారం’ ఆగిపోయిందన్న వార్తలకు రీసెంట్లీ చెక్ పెట్టేసి ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పింది. నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుంది. అటు తమిళ ప్రేక్షకులను పలకరించి కూడా మూడేళ్లు దాటిపోయింది. ‘కాతువాకుల రెండు కాదల్’ తర్వాత కనిపించలేదు.
Also Read : Vijay Deverakonda : ‘రౌడీ జనార్దన’.. మొదలెట్టనున్న కొండన్న.. ముహుర్తం ఎప్పుడంటే
Also Read
అయితే ఓ సినిమా కోసం సమంతను అప్రోచ్ అయ్యారన్నది లెటెస్ట్ బజ్. శింబు- వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్లీ సినిమా టైటిల్ అరసన్‌గా ఎనౌన్స్ చేశారు మేకర్స్. వడా చెన్నై యూనివర్శ్‌లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నట్లు టాక్. కానీ వీరిలో ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటాయో వారిని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఏం మాయ చేసావే తమిళ వర్షన్ విన్నతాండి వరువాయలో స్మాల్ అప్పీరియన్స్ ఇచ్చింది సామ్. శింబు పక్కన అలా మెరిసింది. ఇప్పుడు శింబు సినిమాలో సామ్ కన్ఫర్మ్ అయితే 15ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు జోడీ కడుతున్నట్లే.. మరీ అక్టోబర్ 17 నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాలో ఎవరూ ఫైనల్ అవుతారో చూడాలి. ఇక హిందీలో రక్త్ బ్రహ్మండ్ చేస్తున్న సామ్.. సౌత్‌కు గెస్టుగా మారుతుందా..? పర్మినెంట్ అవుతుందో లెట్స్ వెయిట్
తాజావార్తలు
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?