Site icon NTV Telugu

Samantha : సౌత్‌లో బిజీగా సమంత.. ఈ నెలలోనే స్టార్ట్ కాబోతున్న మా ఇంటి బంగారం

Samatha

Samatha

మళ్లీ సమంత సౌత్ ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తుందా అంటే ఔననే టాక్ వినిపిస్తోంది. ఖుషి తర్వాత కనిపించని సామ్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ‘శుభం’లో మాయగా మెరిసింది. ట్రలాలా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం తెరకెక్కించి నిర్మాతగా డీసెంట్ హిట్ కొట్టేసింది. ఇక ఇదే నిర్మాణ సంస్థలో ఎనౌన్స్ చేసిన ‘మా ఇంటి బంగారం’ ఆగిపోయిందన్న వార్తలకు రీసెంట్లీ చెక్ పెట్టేసి ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పింది. నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుంది. అటు తమిళ ప్రేక్షకులను పలకరించి కూడా మూడేళ్లు దాటిపోయింది. ‘కాతువాకుల రెండు కాదల్’ తర్వాత కనిపించలేదు.

Also Read : Vijay Deverakonda : ‘రౌడీ జనార్దన’.. మొదలెట్టనున్న కొండన్న.. ముహుర్తం ఎప్పుడంటే

అయితే ఓ సినిమా కోసం సమంతను అప్రోచ్ అయ్యారన్నది లెటెస్ట్ బజ్. శింబు- వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్లీ సినిమా టైటిల్ అరసన్‌గా ఎనౌన్స్ చేశారు మేకర్స్. వడా చెన్నై యూనివర్శ్‌లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నట్లు టాక్. కానీ వీరిలో ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటాయో వారిని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, ఏం మాయ చేసావే తమిళ వర్షన్ విన్నతాండి వరువాయలో స్మాల్ అప్పీరియన్స్ ఇచ్చింది సామ్. శింబు పక్కన అలా మెరిసింది. ఇప్పుడు శింబు సినిమాలో సామ్ కన్ఫర్మ్ అయితే 15ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు జోడీ కడుతున్నట్లే.. మరీ అక్టోబర్ 17 నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాలో ఎవరూ ఫైనల్ అవుతారో చూడాలి. ఇక హిందీలో రక్త్ బ్రహ్మండ్ చేస్తున్న సామ్.. సౌత్‌కు గెస్టుగా మారుతుందా..? పర్మినెంట్ అవుతుందో లెట్స్ వెయిట్

Exit mobile version