Site icon NTV Telugu

Samantha : నా బాడీ సహకరించడం లేదు.. మొత్తానికి బయటపడిన సామ్

Samantha

Samantha

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్యూట్ గర్ల్ ఇమేజ్‌తో మొదలై, నేడు పాన్‌-ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్ సినిమాలు అందిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె, ఎమోషనల్ రోల్స్, లవ్ స్టోరీస్, యాక్షన్ డ్రామాల వరకు విభిన్నమైన పాత్రలో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కేవలం నటనలోనే కాదు, ఫ్యాషన్‌ స్టైల్‌లోనూ, సోషల్‌ మీడియా యాక్టివిటీలోనూ సమంత ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా తను తక్కువ సినిమాలు చేయడానికి గల కారణం పంచుకుంది సామ్..

Also Read : ShahRukh Khan : సర్జరీ తర్వాత ఫ్యాన్స్‌కు.. షారుక్‌ఖాన్ స్పెషల్ మెసేజ్

తాజాగా ‘గ్రాజియా ఇండియా’ కవర్‌పేజీపై మెరిసిన ఆమె, అందులో ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవితం, కెరీర్, ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ఎన్ని సినిమాలు చేశారన్నది కాదు.. మనం చేసిన చిత్రాల నాణ్యతే ముఖ్యమని నేను ఎప్పుడు నమ్ముతాను. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తూ ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను. గతంతో పోలిస్తే నాలో చాలా మార్పు వచ్చింది. ఫిట్‌నెస్‌, సినిమాలు రెండింటిపైనా సమానంగా దృష్టి పెడుతున్నాను. నేను చేసిన ప్రాజెక్ట్‌లు గుర్తింపు కోసం కాకుండా నా మనసుకు దగ్గరగా ఉన్న కథలే’’ అని సమంత అన్నారు. తన వర్క్ ప్లానింగ్‌లో మార్పు చేసుకున్న విషయాన్ని కూడా ఆమె స్పష్టంచేశారు.. “ఇకపై తక్కువ సినిమాలు చేస్తాను. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాను. ఒకేసారి ఐదు ప్రాజెక్ట్‌లు చేయడం ఇక జరగదు. నా శరీరం చెప్పేది వినడం నేర్చుకున్నా. పనిని తగ్గించినా.. ప్రేక్షకుల మనసుకు నచ్చే మంచి ప్రాజెక్ట్‌లతోనే ముందుకు వస్తాను. సంఖ్య తగ్గినా, నాణ్యత మాత్రం కచ్చితంగా పెరుగుతుంది’’ అని తెలిపారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version