Site icon NTV Telugu

Samantha : మళ్ళీ పెళ్లి చేసుకున్న సమంత.. వరుడు ఎవరంటే?

Samantha (2)

Samantha (2)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న  టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభిత దూళిపాళ్లను నాగ చైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి కానీ అవేవి నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి.

అనేక సార్లు రాజ్ నిడిమోరు, సమంత జంటగా విదేశాలో వెకేషన్ లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయు. కానీ రాజ్ తో రిలేషన్ గురించి సమంత  ఓపెన్ అవ్వలేదు సామ్. కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత, రాజ్ నిడిమోరు ఎప్పుడు స్పందించేలేదు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో అతి కొద్దీ మంది బందు మిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మేడలో మూడు ముళ్ళు వేసాడు రాజ్. సమంత పెళ్లి చేసుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నూతన దంపతులకు విశేష్ తెలుపుతున్నారు సామ్ అభిమానులు

Exit mobile version