Site icon NTV Telugu

Ye Maaya Chesave : ‘ఏ మాయ చేసావే’ ప్రమోషన్‌లో నేను లేను.. సమంత క్లారిటీ

Em Mayya Chesave Samantha

Em Mayya Chesave Samantha

సమంత కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన సినిమా ‘ఏ మాయ చేసావే’. సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఈ సినిమా, వచ్చే నెల జులై 18న తిరిగి థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా, సామ్-చైతు ఈ రీ రిలీజ్ ప్రమోషన్లలో కలిసి పాల్గొంటారని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై సమంత తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..

Also Read : Japanese skin secret : జపనీస్ అందానికి రహస్యం ఇదే.. 4-2-4 స్కిన్‌కేర్ టెక్నిక్!

‘చిత్ర బృందం తో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు. అలాంటి ప్లాన్‌ ఏదీ లేదు. ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. అభిమానులు నటీనటులు కలిసి సినిమాను ప్రమోట్ చేస్తారని ఊహించుకుని ఉండవచ్చు. కానీ, ఒకరి జీవితం ప్రేక్షకుల ఊహల మీద ఆధారపడి ఉండదు’ అని సమంత వ్యాఖ్యలు చేసింది. అలాగే..

తన తొలి షూటింగ్ అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ.. ‘నిజం చెప్పాలంటే నా మొదటి షూట్‌ ‘మాస్కోవా-కావేరి’ అనే చిత్రానికి. అందులో నా స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించాడు. అయితే ఆ షూట్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. అందుకే ఆ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుకు లేవు. ఇక నా రెండో చిత్రం ‘ఏ మాయ చేసావే’ విషయానికి వస్తే.. అన్ని విషయాలు స్పష్టంగా గుర్తున్నాయి. కార్తీక్–జెస్సీ ఇంటి గేటు దగ్గర తీసిన సీన్ నా తొలి షాట్. కెరీర్ ఆరంభంలోనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి దర్శకుడితో పనిచేయడం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది’ అని తెలిపింది సమంత.

Exit mobile version