Site icon NTV Telugu

Samantha : సమంత.. రాజ్ ప్రేమ ఒప్పుకున్నట్టేనా?

Samantha Dating Rumors,

Samantha Dating Rumors,

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ఏ చిన్న వార్త వచ్చినా నెట్టింట్లో వైరల్ అవ్వడం కొత్తకాదు. తాజాగా ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మరోసారి జోరుగా కొనసాగుతోంది. ఈసారి మాత్రం ఈ ప్రచారానికి బలమైన ఆధారాలు కూడా లభించాయి.

Also Read : Rashmika : సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న రష్మిక బోల్డ్ లుక్..

రాజ్ నిడుమోరు (ఫ్యామిలీ మ్యాన్ ఫేం) దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత బోల్డ్ రోల్‌తో హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహితత పెరిగిందని ఇండస్ట్రీలో టాక్. ఆ తరువాత ఆమె నటించిన ‘సిటాడెల్ ఇండియా’ ప్రాజెక్ట్‌లో కూడా రాజ్ డైరెక్షన్ వ్యవహరించడంతో మళ్లీ ప్రేమ గాసిప్స్ ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఫ్లైట్ రాజు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసి.. ఈ రూమర్ కు మరింత ఆజ్యం పోసింది. కాగా ఇప్పుడు మరోసారి సమంత , రాజు కలిసి మరోసారి దర్శనం ఇచ్చారు.

తాజాగా సమంత వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో ఫొటోలకు ఫోజులిస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే సమంత షేర్‌ చేసిన ఫొటోలలో రాజ్‌ సైతం దర్శనం ఇచ్చారు. రాజ్.. సమంత భుజంపై చేయి వేసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ జంట మరోసారి తమ బంధాన్ని బయటపెట్టినట్లు అయింది. ఇక ఫోటోలు చూసిన నెటిజన్లు..‘రాజ్ – సమంత క్యూట్ కపుల్ లా ఉన్నారు, కంగ్రాట్స్’,‘డేటింగ్ ఓకే, మరి పెళ్లి ఎప్పుడో?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రజంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version