Site icon NTV Telugu

కృతి సనన్ “మిమి”పై సమంత రివ్యూ

Samantha Akkineni review on Kriti Sanon's Mimi

టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని “మిమి” సినిమా రివ్యూ ఇచ్చేసింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన చిత్రంలో పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ లతో పాటు సుప్రియ పాథక్, సాయి తంఖంకర్, మనోజ్ పహ్వా, జయ భట్టాచార్య కూడా కీలక పాత్రల్లో కన్పించారు కన్పించారు. జూలై 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సినిమాను వీక్షించిన సమంత “మిమిలో కృతి సనన్ మీరు చాలా అద్భుతంగా నటించారు. సినిమాలో మీరు చాలా అందంగా, నిజాయితీగా ఉన్నారు. పంకజ్ త్రిపాఠి సర్, మొత్తం టీంకు అభినందనలు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also : ఛాలెంజ్ యాక్సెప్టెడ్… నయనతార “నేత్రికన్” ట్రైలర్

సినిమా విడుదలకు ముందుగానే లీకైనప్పటికీ మేకర్స్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా నటీనటుల నటన, దర్శకుడి ప్రతిభ, కథపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా కృతి సనన్ నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “ఆదిపురుష్‌”లో ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటుంది. ‘తన్హాజీ’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో సీతాదేవి పాత్రలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించిన హిందీ చిత్రం ‘భేడియా’ షూటింగ్ కూడా ఆమె పూర్తి చేసింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మరోవైపు సమంత అక్కినేని గుణశేఖర్‌తో “శాకుంతలం” సినిమా చేస్తోంది.

Exit mobile version