Site icon NTV Telugu

సమంత కొత్త లుక్ అదిరిపోయింది…!

Samantha Akkineni looks drop dead gorgeous in a feather dress

అక్కినేని కోడలు సమంత దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. సౌత్ లో ఆమె స్టైల్ ఐకాన్. ఆమె తన ఫ్యాషన్ అభిరుచితో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాషన్ క్వీన్ తాజాగా షేర్ చేసిన పిక్ నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కళ్ళు తిప్పుకోలేని అందంతో నెటిజన్ల దృష్టిని తనవైపుకు తిప్పేసుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్ కు గంటల వ్యవధిలోనే లక్షల్లో లైకులు, భారీ సంఖ్యలో షేర్లు రావడం విశేషం.

Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ…

ప్రస్తుతం సమంత “శాకుంతలం” చిత్రంతో బిజీగా ఉంది. హైదరాబాద్‌లో “శాకుంతలం” రెండవ షెడ్యూల్ షూట్‌ను తిరిగి ప్రారంభించింది. ఈ చిత్రంలో సామ్‌ శకుంతలగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతగా కనిపించనున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హా కూడా ఒక భాగం కావడం విశేషం. ఈ భారీ పాన్ ఇండియా మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కాగా సామ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన “కాతు వాకులా రేండు కాదల్”లో నటిస్తోంది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

Exit mobile version