Samantha: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చిన్న టాపిక్ వచ్చినా వెంటనే వైరల్ అయిపోద్ది. చైతూ-శోభిత పెళ్లి తర్వాత సమంత మీద సింపతీ బాగా పెరిగింది. సమంత మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఖుషి సినిమా తర్వాత ఆమె తెలుగులో మళ్లీ కనిపించలేదు. మయోసైటిస్ కోసం ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. ఆ నడుమ సిటాడెల్ వెబ్ సిరీస్ లో కనిపించింది. కానీ మళ్లీ సినిమా అప్ డేట్ ఇవ్వట్లేదు. ఇప్పట్లో ఆమె నటించదేమో అనుకుంటున్న టైమ్ లో ఓ న్యూస్ ఆమె ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
Read Also: Priya Prakash : నాకు మూవీ ఛాన్సులు ఇవ్వట్లేదు.. ఆ పని చేసుకుంటున్నా..!
స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి తాజాగా ఐఫా వేడుకల్లో మాట్లాడుతూ సమంత గురించి చెప్పుకొచ్చింది. “సినిమాల్లో మహిళలు’ అనే కాన్సుప్టుపై మాట్లాడుతూ సమంతను ఆకాశానికి ఎత్తేసింది. తమ ఇద్దరి కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటున్నారని.. అది త్వరలోనే మీ ముందుకు వస్తుందంటూ బాంబు పేల్చింది. సమంత సొంత బ్యానర్ లో గతంలోనే ఒప్పుకున్న “మా ఇంటికి బంగారం’ సినిమా షూటింగ్ జరుగుతోందని.. ఈ సినిమాలో నటించేవారందరికీ ఆడ, మగ తేడా లేకుండా సమంత సమానంగా డబ్బులు ఇస్తున్నట్టు నందినిరెడ్డి చెప్పుకొచ్చింది.
Read Also: The Paradise: నాని సినిమాలో పీపుల్ స్టార్.. నిజమేనా..?
అంటే నందినిరెడ్డి డైరెక్షన్ లో సమంత సైలెంట్ గా సినిమా చేసేస్తోందని హింట్ ఇచ్చేసింది. కానీ సమంత మాత్రం ఈ విషయాన్ని ఎందుకు సైలెంట్ గా మెయింటేన్ చేస్తోందనే చర్చ మొదలైంది. ఏదేమైనా సమంత మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తే అదే చాలు అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.