Site icon NTV Telugu

జూలై 23 నుంచీ… సల్మాన్, కత్రీనా రెడీ!

Salman Khan to resume Tiger 3 shoot from August

లాక్ డౌన్ కష్టాల్లోంచి మెల్లెమల్లగా బాలీవుడ్ బయటపడుతోంది. సల్మాన్ ఖాన్ ఇప్పటికే ‘అంతిమ్’ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. అదే ఊపులో తన ప్రెస్టేజియస్ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘టైగర్ 3’ షూట్ లోనూ త్వరలో పాల్గొనబోతున్నాడు. జూలై 23 నుంచీ తన కో సీక్రెట్ ఏజెంట్ కత్రీనాతో కలసి ‘టైగర్’ న్యూ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. ముంబైలో జరిగే ఈ కీలక చిత్రీకరణలో సినిమాలోని ప్రధాన నటీనటులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తారట. విలన్ గా నటిస్తోన్న ఇమ్రాన్ హష్మి కూడా జూలై 23 తరువాత కొద్ది రోజుల గ్యాప్ లోనే సల్మాన్, కత్రీనాతో జాయిన్ అవుతాడు. ముంబై షెడ్యూల్ తరువాత ‘టైగర్’ టీమ్ ఇంటర్నేషనల్ లోకేషన్స్ కు బయలుదేరనుంది.

Read Also : “విక్రమ్ వేద” హిందీ రీమేక్ లో హృతిక్, సైఫ్

యూరోప్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ‘టైగర్’ యాక్షన్ సీక్వెన్సెస్ పిక్చరైజ్ చేయాలని ప్రస్తుతానికి దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అయితే, కరోనా కారణంగా ఎప్పటికప్పుడు నెలకొంటోన్న అనూహ్య పరిస్థితుల వల్ల ఇంకా ఏయే దేశాల్లో షూట్ చేయాలో నిర్మాత ఆదిత్య చోప్రా డిసైడ్ కాలేదని సమాచారం. అయితే, ఆగస్ట్ 15 లోపు ముంబై షెడ్యూల్ పూర్తి చేసి… ఆ తరువాత అంతర్జాతీయ ప్రయాణానికి బయలుదేరాలని డైరెక్టర్ మనీశ్ శర్మ అనుకుంటున్నాడట. చూడాలి మరి, ఈ వ్యవహారమంతా పూర్తై సల్మాన్, కత్రీనాల స్పై థ్రిల్లర్ ‘టైగర్’ ఎప్పుడు మన ముందుకు వస్తుందో…

Exit mobile version