గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్లో సల్మాన్ పాల్గొంటున్నాడని, అందుకు సంబంధించి టికెట్స్ కొనాలనేది ఆ వార్త సారాంశం. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోను చూసేందుకు సల్మాన్ ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. తమకు తెలియకుండా జరిగిన ఈ ఫేక్ ప్రచారంపై సల్మాన్, ఆయన టీం స్పందించారు. ఈ విషయంలో ఆయన అభిమానులను హెచ్చరించారు. అమెరికాలో జరిగే ఈవెంట్లో సల్మాన్ పాల్గోనున్నారని.. దానికోసం టికెట్స్ కొనాలని వస్తున్న వార్తలన్నీపూర్తి అవాస్తవం అని తెలిపారు. తాను అమెరికాలో జరిగే ఏ ఈవెంట్ లోనూ పాల్గొనడం లేదని స్పష్టత ఇచ్చారు.
Also Read : Poonam Kaur : జానీ మాస్టర్ ని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు..
ఈ ఏడాది అమెరికాలో జరిగే ఏ ఈవెంట్‌తో సల్మాన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అతని అనుబంధ కంపెనీలకు కూడా దీనిపై ఎటువంటి సమాచారం లేదు. అతని బృందం అమెరికాలో కచేరీలు కానీ ప్రదర్శనలు కానీ ఎటువంటి వాటిని నిర్వహించడం లేదు. ఈ ఈవెంట్‌లో సల్మాన్ పాల్గొంటాడన్న ప్రచారాన్ని నమ్మవద్దు. దీనికి సంబంధించిన మెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దు. తమ స్వలాభం కోసం సల్మాన్ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సల్మాన్ బృందం పేర్కొంది. ఇందుకు సంబంధించి సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్‌ను చేశారు. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న కొందరు ఇదంతా సోషల్ మీడియా కేటుగాళ్లు చేసిన మోసం అని తెలిసి తాము మోసపోయామని వాపోయారు.