Site icon NTV Telugu

Salman khan : విడాకులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్ ఖాన్..

Salman Khan

Salman Khan

ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ తన టీమ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో విశేషం ఏంటంటే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ షోకు శాశ్వత అతిథిగా తిరిగి రావడం. ఇక ఎపిసోడ్‌కి సల్మాన్ ఖాన్ ఫస్ట్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవడం ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచింది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : Samantha : ముందు కంటే ఇప్పుడే బాగున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత..

ఈ క్లిప్‌లో సల్మాన్ ఖాన్, తన ‘బీయింగ్ హ్యూమన్’ టీషర్ట్‌లో ఎంతో కూల్‌గా కనిపిస్తూనే – విడాకులు, సహనం, సంబంధాల విలువ వంటి విషయాలపై తనదైన స్టైల్‌లో సరదా కోణంలో కామెంట్స్ చేశారు. ‘మునుపటిలా సంబంధాలు ఉండడం లేదు. ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసే రోజులు పోయాయి. అప్పట్లో సహనం ఉండేది. కానీ ఇప్పుడు? రాత్రి ఒకరి కాలు మరొకరి మీద పడిందన్నా, కొంచెం గురక పెట్టారన్నా చాలు – విడాకులు తీసుకుంటున్నారు. అతి చిన్న కారణాలకే విడిపోతున్నారు. అంతే కాదు, విడాకుల తర్వాత ఆవిడ సగం డబ్బు కూడా తీసుకెళ్లి పోతున్నారు’ అని హాస్యంగా వ్యాఖ్యానించారు సల్మాన్ ఖాన్.  అతని కామెంట్స్‌కి, స్టేజ్‌పై ఉన్నవారితో పాటు ఆడియన్స్ కూడా పగలబడి నవ్వారు. ఇదే సమయంలో చాలామంది అభిమానులు అతని కామెంట్స్‌కు పూర్తిగా ఏకీభవిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.. ఓ నెటిజన్ ‘ఇది 100 శాతం నిజం’ అని కామెంట్ చేశారు. మ‌రి కొందరు ఎప్పటి మాదిరిగానే స‌ల్మాన్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైన స‌ల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version