Site icon NTV Telugu

Bollywood : సైయారా అరాచకం అన్ స్టాపబుల్.. ఇప్పటి వరకు ఎంత రాబట్టిందటే?

Bollywood

Bollywood

లో బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సైయారా ఇప్పుడు బాలీవుడ్ లో రొమాన్స్‌ను మళ్లీ గట్టిగా ట్రిగర్ చేసింది. ఇప్పుడు అదే ట్రాక్ లో కి బాలీవుడ్ రొమాంటిక్ గేర్ మార్చింది. సినిమాలో ఉండే లవ్ సింప్లిసిటీ, ఎమోషనల్ టచ్, మ్యూజికల్ మ్యాజిక్ ఆడియెన్స్‌ను బలంగా టచ్ చేశాయి. దాంతో బాలివుడ్ లో లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సినిమాలు లైనప్ లో కొచ్చాయి. దఢక్‌ 2,జిగ్రా, పరమ్‌ సుందరి,లాంటి రొమాంటిక్‌ సినిమాలు రిలీజ్‌కి సిద్దమౌతున్నాయి. ఈ కొత్త సినిమాలపై సైయారా ఎఫెక్ట్ గట్టిగా ఉందని బి టౌన్ లో బజ్ క్రియేట్ అయ్యింది.

Also Read : Mahati Swara Sagar : చాలా కాలం తర్వాత మణిశర్మ కొడుకు మరో సినిమాకు సంగీతం

ఆషికి 2, ఎక్ విల‌న్, ఆవరాప‌న్, లాంటి సినిమాలతో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి తెరకెక్కించిన సైయారా తో ఆహాన్ పాండే, అనిత్ ప‌డ్డా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ల‌వ్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ సినిమా ఎటువంటి మౌత్‌ టాక్ లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 250 కోట్ల కలెక్షన్స్ తో రన్ అవుతోంది. దాంతో అందరి దృష్టి సైయార వైపు టర్న్ అవుతోంది. సైయారా కేవలం ఆడియన్స్ ను మాత్రమే కాదు సిని సిలబ్రిటీ స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. బిఫోర్ రిలీజ్ ఈ మూవీ ఈ రేంజ్ సక్సెస్ ను ముందే ఊహించాను అని రియాక్ట్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. దానికి మోహిత్ సూరి కూడా రియాక్ట్ అయ్యాడు నేను ఎంతో అభిమానించే ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా. తన టేకింగ్‌ , ప్రెజెంటేషన్‌ నాకు చాలా ఇష్టం అంటూ సందీప్ వంగాకి కృతజ్ఞతలు తెలిపాడు మోహిత్‌ సూరి. సూపర్ స్టార్ మహే శ్ బాబు సైయారా నిజాయితీ ప్రేమకథ తో ఆకట్టు కుంది అని ట్వీట్ చేసాడు. ఇంకా క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్ కూడా సైయారా లవ్ స్టొరీ తనని కట్టిపడేసిందని తన ఫీలింగ్‌ షేర్ చేశాడు.

Exit mobile version