Site icon NTV Telugu

Bollywood : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన రూ. 581 కోట్లు వసూలు చేసిన సినిమా

Saiyaara

Saiyaara

బాలీవుడ్  లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సైయారా. ఆహాన్ పాండే, అనీత్ పద్ద లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేని సైయారా రిలీజ్ తర్వాత సంచనలం సృష్టించింది. సినిమాలో ఉండే లవ్ సింప్లిసిటీ, ఎమోషనల్ టచ్, మ్యూజికల్ మ్యాజిక్ ఆడియెన్స్‌ను బలంగా టచ్ చేశాయి.  ఆషికి 2, ఎక్ విల‌న్, ఆవరాప‌న్, లాంటి సినిమాలతో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి తెరకెక్కించిన సైయారా తో ఆహాన్ పాండే, అనిత్ ప‌డ్డా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు.

Also Read : Rukmini Vasanth : రుక్మిణి వసంత్ ను ఆ ఇద్దరు హీరోలే ఆదుకోవాలి

ల‌వ్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ సినిమా ఎటువంటి మౌత్‌ టాక్ లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 580 కోట్లకుపైగా కలెక్షన్స్ తో బాలీవుడ్ లో సెన్సేషన్ చేసింది. దాంతో అందరి దృష్టి సైయార పై మళ్లింది. సైయారా కేవలం ఆడియన్స్ ను మాత్రమే కాదు సిని సిలబ్రిటీ స్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది. ఇంతటి సెన్సేషన్ చేసిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అవుతోంది. థియేటర్ లో 50 రోజుల రన్ పూర్తి చేసుకున్న సైయారా ఇప్పటికి స్టడీ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు సైయారాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకువస్తుంది. ఈ నెల 12న సైయారాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సైయారా ఓటీటీలో ఎలాంటి సంచలనం చేస్తుందో చూడాలి.

Exit mobile version