Site icon NTV Telugu

Sai Abhyankar: ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అప్పుడే బిగ్ ఆఫర్స్!

Sai Abhyankar

Sai Abhyankar

దక్షిణ చిత్ర పరిశ్రమలో యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్. తన తొలి సినిమా విడుదల కాకముందే, ఏకంగా ఏడు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశాలను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తొలి సోలో సింగిల్ ‘కచ్చి సెరా’తో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ప్రీతి ముఖుందన్‌తో కలిసి చేసిన ‘ఆశ కూడ’, మీనాక్షి చౌదరితో ‘సితిర పుత్తిరి’ వంటి పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్, ప్రస్తుత సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ వద్ద కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసిన అనుభవం సాయి అభ్యంకర్కు బాగా కలిసొచ్చింది.

Also Read :Mahavatar Narsimha : ఆస్తులన్నీ అమ్ముకున్నా.. మహావతార్ డైరెక్టర్ కష్టాలు

పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా అనుభవం లేకపోయినా, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని సాయి అభ్యంకర్ దక్కించుకున్నాడు. అంతేకాకుండా, సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ చిత్రంలో ఎ.ఆర్. రెహమాన్ స్థానంలో ఆయన ఎంపికవడం విశేషం. కార్తీ సినిమాకు కూడా సంగీత బాధ్యతలు చేపట్టాడు. ఈ పెద్ద ప్రాజెక్టులతో పాటు, త్వరలో విడుదల కానున్న ‘డూడ్’, ‘బాల్టీ’, ‘బెంజ్’ వంటి చిత్రాలకు కూడా సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చాడు. తన రాబోయే చిత్రాలతో సంగీత ప్రియులను మెప్పించగలిగితే, దక్షిణాదిలో అతనొక గొప్ప సంగీత దర్శకుడిగా ఎదగడం ఖాయం.

Exit mobile version