NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కాసుల వర్షం

Saif

Saif

‘నా జీవితం మారిపోయింది’ అని సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ అంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు, అతనికి ఆర్థిక సహాయం కూడా అందించాడు. గత వారం ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడికి గురైన సైఫ్ అలీఖాన్‌ను భజన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రానా మాట్లాడుతూ, సైఫ్ అలీ ఖాన్ సకాలంలో సహాయం చేసాడని, తనకు ఆర్థిక సహాయం కూడా చేశాడని చెప్పుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్‌కు చేసిన వాగ్దానాన్ని ఉటంకిస్తూ డ్రైవర్ ఎంత ఇచ్చాడు అనేది బయట పెట్టనప్పటికీ భజన్ సింగ్ రానా దాదాపు రూ. 50,000 అందుకున్నట్లు ఓ నేషనల్ పోర్టల్ రిపోర్ట్ చేసింది. ఇక భజన్ సింగ్ స్వస్థలం ఉత్తరాఖండ్. రానా మరో నలుగురు రూమ్‌మేట్స్‌తో కలిసి ఖార్‌లోని ఒక గదిలో నివసిస్తున్నాడు. భజన్ సింగ్ రానాను ఈ మొత్తం గురించి అడిగినప్పుడు, “నేను ఆయనకు (సైఫ్) వాగ్దానం చేసా, దానికి కట్టుబడి ఉంటాను. ఆయన (సైఫ్) నాకు రూ. 50,000 లేదా రూ. 1,00,000 ఇచ్చాడని ప్రజలు అనవచ్చు, కానీ నేను ఎంత ఇచ్చాడో చెప్పడానికి ఇష్టపడను.

Anil Ravipudi: ఫేక్ కలెక్షన్స్ పై అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు

ఈ సమాచారాన్ని బయట చెప్పవద్దని ఆయన నన్ను అభ్యర్థించాడు. నేను అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను, ఏది జరిగినా ఆయన ఎంత ఇచ్చాడు అనేది ఆయనకు, నాకు మధ్య ఉంటుంది అని అన్నాడు. మంగళవారం సాయంత్రం నటుడి డిశ్చార్జికి ముందు, భజన్ సింగ్ రానాకు సైఫ్ అలీ ఖాన్ మరియు అతని కుటుంబాన్ని కలిసే అవకాశం లభించింది. సైఫ్ అలీఖాన్ తల్లి, ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ పాదాలను కూడా ఆటో డ్రైవర్ తాకారు. నటుడి కుటుంబం తనను ఎంతో ప్రేమగా చూసుకున్నారని, కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారని భజన్ సింగ్ చెప్పారు. రానా మాట్లాడుతూ, “నేను అతనిని (సైఫ్) నిన్న (మంగళవారం) ఆసుపత్రిలో కలిశాను. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు ఫోన్ చేశాడు. నన్ను మెచ్చుకున్నాడు. ఖాన్ నన్ను అతని తల్లి (షర్మిలా ఠాగూర్)కి పరిచయం చేసాడు, నేను ఆమె పాదాలను తాకాను. అతను నాకు ఏది సరైనదని భావించాడో అది ఇచ్చాడు, నాకు సహాయం అవసరమైనప్పుడు అండగా ఉంటానని చెప్పాడు. సైఫ్ అలీఖాన్‌ను తన ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లారనే వార్త తెలియగానే తనకు మీడియా, స్నేహితులు, బంధువుల నుంచి కాల్స్ రావడం మొదలైందని రానా చెప్పాడు.