Site icon NTV Telugu

Sai Pallavi: వన్ లవ్, వన్ ఛాన్స్.. సాయి పల్లవి కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!

Ek Din Release Date

Ek Din Release Date

సహజ నటనకు చిరునామాగా నిలిచిన సాయిపల్లవి, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏక్ దిన్’. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ తాజాగా విడుదలై.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జునైద్ ఖాన్, సాయిపల్లవిలు మంచు వర్షంలో ఐస్‌క్రీమ్ ఆస్వాదిస్తూ.. నడుస్తున్న ఫొటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘వన్ లవ్, వన్ ఛాన్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్ అద్భుతంగా ఉంది.

ఏక్ దిన్ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కథను స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా కలిసి రచించారు. జీవిత గందరగోళంలో ప్రేమ ఎలా దారి కనుగొంటుందనే కాన్సెప్ట్‌తో ఏక్ దిన్ ఒక సున్నితమైన లవ్ స్టోరీగా రూపొందుతున్నట్టు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. సాయిపల్లవి సహజమైన అభినయం, జునైద్ ఖాన్ సింపుల్ లుక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని మన్‌సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని రామ్ సంపత్ అందిస్తుండగా.. పాటల లిరిక్స్‌ను ఇర్షాద్ కమిల్ రాశారు. ఏక్ దిన్ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ శుక్రవారం (జనవరి 16) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Also Read: Vijay Sethupathi Birthday: పండగ కబురు.. ‘పూరి-సేతుపతి’ ఫస్ట్ లుక్, టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్!

దక్షిణాదిన హిట్ హీరోయిన్ ట్యాగ్ అందుకున్న సాయి పల్లవి.. హిందీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితమే రెండు బాలీవుడ్ సినిమాలు సైన్ చేశారు. అయితే రెండు సినిమాల రిలీజ్ కాస్త లేటవుతోంది. సాయి పల్లవి ఒప్పుకున్న మొదటి హిందీ చిత్రం ఏక్ దిన్. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీ వచ్చేసింది. రెండో చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. దర్శకుడు నితీస్ తివారి తీస్తున్న ఈ రామాయణం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి రానుంది.

Exit mobile version