Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi Wins Hearts as Sita in Ramayana Trailer: దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే తన సహజ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో కెరీర్లో మరో కీలక దశలోకి అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా ‘రామాయణ’ సినిమాతో ఆమెపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్లో సీత పాత్రలో ఆమె ఒదిగిపోయారు.
బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక రామాయణ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం 2026 దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. రెండో భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నేడు రిలీజ్ అయిన రామాయణ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి తన సహజసిద్ధమైన నటన, అభినయంతో సీతమ్మ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.
Also Read
- SrinivasaMangapuram : ఘట్టమనేని 'జై కృష్ణ' శ్రీనివాస మంగాపురం ఓవర్సీస్ రివ్యూ
- Atlee: బాలీవుడ్‌లోనూ జోరు.. ముంబైలో రూ.38 కోట్ల సీ ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేసిన అట్లీ
- Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో 'రామాయణం' ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్‌తో కట్టిపడేసిన మేకర్స్
- Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా 'పళ్ళబురుసు' టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
రామాయణంతో పాటు సాయిపల్లవి నటిస్తున్న మరో కీలక చిత్రం ‘OM: Chapter 1’. ఈ సినిమా 2026 అక్టోబర్ 16న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే కాకుండా ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్‌లో కూడా సాయిపల్లవి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, విడుదల తేదీని చిత్రబృందం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ సాయిపల్లవి తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. రామాయణ, OM: Chapter 1, మణిరత్నం ప్రాజెక్ట్, రామాయణ: పార్ట్ 2 చిత్రాలతో 2026–27లో సాయిపల్లవి ఇండియాలో టాప్ స్టార్ కానున్నారు.
Thank you to director Nitish Tiwari for potraying our Sai Pallavi as Sita Maa in a very great manner😍🛐
Whoever judged about whether Sai Pallavi can play Sita Maa see how divine and beautiful she is cant take my eyes 😭🙇#SaiPallavi @Sai_Pallavi92#Ramayana pic.twitter.com/DM2hYbyB9A— Pallavi_Universe 🏹 (@PVAniruddh) July 30, 2026
తాజావార్తలు
-
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
-
Colorful RimBook L1 Plus: AMD రైజెన్ 7 7735HS ప్రాసెసర్‌తో.. కలర్ ఫుల్ రిమ్బుక్ L1 ప్లస్ ల్యాప్‌టాప్ విడుదల
-
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
-
AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
-
SrinivasaMangapuram : ఘట్టమనేని ‘జై కృష్ణ’ శ్రీనివాస మంగాపురం ఓవర్సీస్ రివ్యూ
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!