Site icon NTV Telugu

Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి ప‌ల్లవి..?

Saipalavi (2)

Saipalavi (2)

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఎప్పుడు సింపుల్ లుక్, నేచురల్ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. సినిమాల్లో సున్నితమైన పాత్రలు, నటనకు ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడి స్టైల్, ఫ్యాన్స్ ను ఎల్లప్పుడూ మురిపిస్తూనే ఉంది. అయితే తాజాగా సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజా కన్నన్ తో కలిసి విదేశాల్లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Also Read : Naresh: మా సినిమా రివ్యూలు అన్నీ ప్రింట్ తీయిస్తున్నా!

అయితే .. సాధార‌ణంగా హీరోయిన్స్ బికినీ వేయ‌డం కామ‌న్. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ విదేశాల‌కి వెళ్లిన‌ప్పుడు, బీచ్ ప్రాంతాల‌లో ఎంజాయ్ చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు బికినీ వేసి సంద‌డి చేస్తుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. కాని పద్దతికి చీర చూసినట్లు ఉండే సాయి పల్లవి.. ఒక్కసారిగా బికినిలో దర్శనమిచ్చింది.

ఫుల్ ఫోటోలు రివిల్ అవ్వన్నప్పటకి తనకు సంబంధించిన బికిని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసే సరికి ఫ్యాన్స్ ఫ్రీజ్ అయిపోయారు. “సాయి పల్లవి బికినీలో? నమ్మలేకపోతున్నాం!”, “ఇంతవరకు పద్ధతిగా కనిపించిన పల్లవి ఇలా మారిపోయింది?” అనే రకమైన కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే ఇది నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే కొంతమంది.. నెటిజన్లు సాయి పల్లవికి మద్దతుగా నిలిచారు. “ఇది ఆమె వ్యక్తిగత జీవితం, వెకేషన్‌లో తనకు నచ్చినట్లు డ్రెస్ వేసుకోవడంలో తప్పేమీ లేదు” అని వారు అన్నారు. నిజానికి, సినిమాల్లో పద్ధతిగా కనిపించే స్టార్ అయినా, పర్సనల్ లైఫ్ లో స్వేచ్ఛ ఉంటుందనే అంశంను కొంతమంది గుర్తు చేశారు.

Exit mobile version