Naresh: మా సినిమా రివ్యూలు అన్నీ ప్రింట్ తీయిస్తున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..
Also Read : Radhika Sarathkumar : సీనియర్ నటి రాధిక తల్లి గీత కన్నుమూత..
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
వీకే నరేష్ మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీలోని సోల్ మా అందరినీ ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేసింది. ఆ సోల్ ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు సినిమా రిలీజ్‌కంటే ముందే శాలువా కప్పేశాను. ఎందుకంటే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. నా కెరీర్‌లో 350 మూవీలు చేసి ఉంటాను.. ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలన్నీ కూడా ప్రింట్ అవుట్ తీసుకుంటున్నాను. ఇలాంటి రివ్యూలు నా జీవితంలో ఇంతవరకు రాలేదు. మా మూవీని ఇంత ఆదరించిన మీడియాకు థాంక్స్. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఈ మూవీ నాకు మాత్రం ఎంతో స్పెషల్. ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే చిత్రమిది. అందరి మనసులకు హత్తుకునే మూవీని తీసిన వర్దన్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. సుబ్బు మంచి కథను ఇచ్చారు. సాయి కుమార్ కెమెరా వర్క్ ఎంతో అందంగా అనిపించింది. విజయ్ పాల్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒకే నెలలో సక్సెస్, ఫెయిల్యూర్ చూశాడు. నిండు కుండ తొణకదు అన్నట్టుగా నిర్మాత ఉన్నారు. నీలఖి అద్భుతంగా నటించారు. అంకిత్ కొయ్య ఇండస్ట్రీలో నిలిచిపోతాడు. విజయ్ బుల్గానిన్ మంచి సంగీతాన్ని అందించారు. లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాలను జోడించిన ఈ మూవీని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!