NTV Telugu Site icon

Sai pallavi : అనుకోని వివాదంలో సాయిపల్లవి.

Sp

Sp

సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటిస్తున్న సినిమా అమరన్. మేజర్ ముకుందన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మేజర్ భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ కానున్న అమరన్ ప్రమోషన్స్ లో సాయి పల్లవి ఫుల్ బిజీగా ఉంది.  ఎప్పుడు వివాదాలు, గొడవలకు దూరంగా ఉండే సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో సాయి పల్లవి ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలిచింది.

Also Read : AlluArjun : ఇండియన్‌ బిగ్గెస్ట్‌ రిలీజ్‌ సినిమాగా పుష్ప-2 రికార్డు

గతంలో సాయి పల్లవి విరాట పర్వం అనే సినిమాలో నటించింది. నక్సలైట్ కథ నేపథ్యం ఉన్న సినిమా అది. ఆ సినిమా విడుదలటైమ్ లో  ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ “పాకిస్తాన్ లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రిస్ట్ లలా కనిపిస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. మనం హార్మ్ చేస్తామనుకుంటారు కాబట్టి. మనకు వాళ్లు అలానే కనిపిస్తారు.చూసే విధానం మారిపోతుంది. అందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేను’ అని అన్నారు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాయి పల్లవి తాజ చిత్రం అమరన్ దేశం కోసం పోరాడిన మేజర్ జీవితం ఆధారంగా రానున్న సినిమా. ఇక్కడ పుట్టి పాకిస్థాన్ చేసిన పని మంచిది అంటావా..? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మారాయి.  కొందరు గిట్టని వారు కావాలని పాత వీడియోను తవ్వి తీసి సాయి పల్లవిపై నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు.

 

Show comments