AlluArjun : ఇండియన్ బిగ్గెస్ట్ రిలీజ్ సినిమాగా పుష్ప-2 రికార్డు
- డిసెంబరు 5న పుష్ప -2 రిలీజ్
- పుష్ప -2 భారీ ఎత్తున రిలీజ్ కు సన్నాహాలు
- రిలీజ్ లో సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప రాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read : Allu Arjun : పుష్ప – 2 అంటే ఆ మాత్రం భయం ఉండాలా..
Also Read
డిసెంబరు 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల జరిగిన నేషనల్ ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో సన్సేషనల్ న్యూస్‌ను వెల్లడించారు మేకర్స్. పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి మొత్తం 11,500 స్ర్కీన్స్‌ల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు మేకర్స్. కేవలం ఇండియాలోనే 6500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుండగా, అటు ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్ లో పుష్ప -2 గ్రాండ్ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు నిర్మాతలు. అయితే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్ ఫిల్మ్ సర్కిల్స్. ఇక పుష్ప-2 బాక్సాఫీస్ రూల్‌లో కలెక్షన్ల పరంగా బాక్సీఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు కూడా సృష్టిస్తుందని అంటున్నాయి ట్రేడ్ విశ్లేషకులు. ఓవర్సీస్‌లో ఒకరోజు ముందుగా డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది పుష్ప – 2.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!