ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్

కోలీవుడ్ స్టార్ ఆర్య నటించిన తమిళ చిత్రం “సర్పట్ట పరంబరై” ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఆయన అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ నేడు విడుదల కావడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సర్పట్టా, ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య అహంకారంతో నిరంతరం జరిగే పోరాటాన్ని ట్రైలర్ లో చూపించారు. 70ల నేపథ్యంలో బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది.

Read Also : ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్

ఈ చిత్రం గురించి ఆర్య షాకింగ్ బాడీ ట్రాన్సఫార్మేషన్ లోకి మారాడు. జిమ్ లో కష్టపడి బాక్సర్ గా కనిపించడానికి కండలు తిరిగిన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రం ఆర్య కెరీర్ లోనే స్పెషల్ గా మారుతుందని అంటున్నారు. సినిమాలో ఆ రేంజ్ లో ఆర్య నటన ఉంటుందట. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రం జూలై 22 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ మూవీకి పా.రంజిత్ దర్శకత్వం వహించగా, నీలం ప్రొడక్షన్స్ అండ్ కె 9 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో దుషారా విజయన్, జాన్ కొక్కెన్, కలైరసన్, పసుపతి, జాన్ విజయ్, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-